వ‌ర్మ ట్విట్ట‌ర్‌లో చ‌చ్చిపోయాడ‌ట‌



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎదిగిన రాంగోపాల్‌వ‌ర్మ బాలివుడ్‌లో కూడా త‌న‌కంటూ ఓ పేరు సంపాదించుకున్నాడు. రాజ‌కీయ కోణాల్లో సినిమాలు తీయ‌గల దిట్ట‌గా  పేరు తెచ్చుకున్న ఆయ‌న ఇటీవ‌లె ట్విట్ట‌ర్ కామెంట‌ర్‌గా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాడు. రాజ‌కీయ‌, సినీ నేప‌థ్యంలో త‌న విమ‌ర్శ‌ల‌ను ట్విట‌ర్‌లో పెట్టి సంచ‌ల‌నాలు సృష్టించాడు. ట్విట్టర్‌లో పలువురి మీద కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే వర్మ ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ నుంచే బయటకు వెళ్లిపోయాడు! తాను ట్విట్టర్‌లో చచ్చిపోయానని, ఇదే తన చివరి ట్విటర్ అని పోస్ట్ చేశాడు. ఇన్నేళ్లపాటు తనను ఫాలో అయినందుకు ఫాలోవర్లకు నో థ్యాంక్ అని చెప్పి మరీ ట్విట్టర్‌ను నిష్క్రమించాడు. ముందుగా రాత్రి 8 గంటలకు తాను ఒక అన్‌ ప్లెజెంట్ వార్త చెబుతానని అన్నాడు. కాసేపటి తర్వాత, అప్పటివరకు వేచి ఉండలేనని, ఇప్పుడే చెప్పేస్తానని అన్నాడు. ఒక్క నిమిషం కూడా తను వృథా చేయదలచుకోలేదని చెప్పాడు. ఇదే తన చివరి ట్విటీ అని ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోల రూపంలో మాట్లాడతానని పేర్కొన్నాడు. తన ట్విట్టర్ మరణానికి ముందు ఇదే తన చిట్టచివరి ట్వీట్ అని, అయితే తాను ఎప్పుడూ ‘రిప్’ మాత్రం చెప్పబోనన్ని అన్నాడు. ట్విట్టర్‌లో తాను 27-05-2009లో పుడితే 27-05-2017 తన మరణం అని పేర్కొన్నాడు. వర్మ చివరి ట్వీట్ తర్వాత ట్విట్టర్ నుంచి అతడి పేజీ మాయం కావడం గమనార్హం. వ‌ర్మ ట్విట‌ర్‌లో ఇలా నిష్క్ర‌మించాడు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*