రాహుల్ గాంధీ పర్యటన కోసం కాంగ్రెస్ రెడీ



Want create site? Find Free WordPress Themes and plugins.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ముగిసిన వారానికే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగు పెట్టనున్నారు. జూన్ 1న తెలంగాణలో అడుగు పెట్టనున్న రాహుల్ సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అదే రోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతోను ప్రత్యేకంగా రాహుల్ భేటీ కానుండటం ఉత్కంఠను పెంచుతోంది. టీ.కాంగ్రెస్ ను బలోపేతం చేయడం, పార్టీలో ఉన్న లుకలుకలను సరిచేయడమే లక్ష్యంగా రాహుల్ పర్యటన సాగనుంది. పార్టీ క్యాడర్ లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా రాహుల్ మాట్లాడితే రానున్న ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామంటున్నారు నేతలు. ఇప్పటికిప్పుడు పిసిసి చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చే ఆలోచన చేయడం లేదు హైకమాండ్. మాటి మాటికి పిసిసి చీఫ్ ను మార్చడం వల్ల క్యాడర్ కు ఇబ్బందనే ఆలోచన చేస్తుంది. అందుకే ఉత్తమ్ ను కొనసాగించేందుకే మొగ్గు చూపారు రాహుల్. రాహుల్ పర్యటనను విజయవంతం చేసేందుకు ముందుగా టీకాంగ్రెస్ నేతలు బేటీ కానున్నారు. మరోవైపు బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డితో పాటు..పలువురుతో మాట్లాడుతోంది అధిష్టానం. టీఆర్ఎస్ కు ప్రజల్లో ఇప్పుడిప్పుడే వ్యతిరేకత పెరుగుతుందని..ఇలాంటి సమయంలో రాహుల్ టూర్ తమకు లాభిస్తుందని అంచనా వేస్తున్నారు నేతలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీన సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేస్తామని నేతలు తెలిపారు. కేజీ టూ పీజీ, రెండు పడక గదుల ఇళ్లు, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్ల పెంపు, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలను తెరాస ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆ పార్టీ ఆరోపించింది.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*