భారత్ ను మెచ్చుకుంటున్న అమెరికన్లు…



Want create site? Find Free WordPress Themes and plugins.
విదేశీ పెట్టుబడుల ఆకర్షణ భారత్‌ దూసుకుపోతుంది. వెలిగిపోతుందనే భావన వ్యక్తం చేస్తున్నారు అమెరికన్ ప్రజా ప్రతినిధులు. ఇదే విషయాన్ని ప్రతినిధుల సభలోనే ప్రస్తావించడం విశేషం. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించడంలో ఇండియా ఊహించని విధంగా ముందంజలో ఉందన్నారు. అమెరికా ప్రజాప్రతినిధుల సమావేశంలో ఈ ప్రస్తావన వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్‌  మేరిలాండ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీకి చెందిన ప్రొఫెసర్‌ రాబర్ట్‌ ఓర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో సభ్యులు ఏకీభవించారు. ఇండియా పలు రంగాల్లో శరవేగంగా, జాగ్రత్తగా ముందుకు వెళుతోందని రాబర్ట్‌ ఓర్‌ అన్నారు. రెన్యూవబుల్‌ ఎనర్జీ వంటి విషయాల్లోనూ ఎంతో అభివృద్ధి సాధిస్తుందని, వినూత్నంగా ఆలోచన చేస్తు ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పారాయన. సౌరవిద్యుత్, పవన విద్యుత్‌ వంటి రంగాల్లో భారత్‌ గొప్ప ఆశయాలను, లక్ష్యాలను పెట్టుకుందని తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన స్మార్ట్‌ సిటీస్‌ అనే అంశంపై ఒక వ్యూహాత్మక అడుగుగా ఆయన అభివర్ణించారు. అటు వ్యాపార పరంగా ఇటు ఆర్థికాభివృద్ధి పరంగా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలాగే ఎన్నో అవకాశాలను భారత్‌ అందిపుచ్చుకుంటుందని చెప్పడం చర్చనీయాంశమైంది. చైనాలాంటి దేశంతో భారత్‌ పోటీ పడుతున్నా…సునాయసంగా, శరవేగంగా అడుగులు వేస్తుంది ఇండియానేనని చెప్పారు సభ్యులు. రానున్న రోజుల్లో భారత్ ప్రబల శక్తిగా ఎదగడం ఖాయమనే చర్చ జరిగింది
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*