తమిళనాట బాలయ్య సినిమా…



Want create site? Find Free WordPress Themes and plugins.
నంద‌మూరి అందగాడు బాల‌కృష్ణ సినిమాలు దాదాపు తెలుగుకే ప‌రిమితం. బాల‌య్య సినిమాలు ఎక్కువగా తెలుగు నేటివిటికీ ప‌రిమిత‌మ‌య్యే ఉంటాయి. అలాంటి బాల‌య్య సినిమాకు కోలీవుడ్‌లో సూప‌ర్ క్రేజ్ రాబోతోంది. బాల‌య్య కెరీర్‌లో 100వ సినిమాగా తెర‌కెక్కిన సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. సంచలన విజయంగా నమోదైన ఈ సినిమా బాల‌య్య కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్. ఈ మూవీ ఏకంగా రూ.77 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.
           జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ (క్రిష్‌) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఆంధ్ర‌దేశాన్ని పరిపాలించిన శాత‌వాహ‌న చ‌క్ర‌వ‌ర్తి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కింది. ఇప్పుడు త‌మిళ్‌లో సైతం రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో తెర‌కెక్కిన బాహుబ‌లి – ది బిగినింగ్‌, బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమాలు త‌మిళ్‌లో బాగా ఆడాయి. అక్కడి సినిమాల‌ను మించి ఆడాయి.
         ఈ రెండు సినిమాల దెబ్బ‌తో తెలుగు పిరియాడిక‌ల్ సినిమాపై త‌మిళ సినీ జ‌నాల‌కు ఆసక్తి పెరిగింది. అందుకే శాత‌క‌ర్ణి సినిమాను సైతం అక్క‌డ రిలీజ్ చేసేందుకు ప‌లువురు నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు పోటీప‌డ్డారు. దీంతో శాత‌క‌ర్ణి త‌మిళ డ‌బ్బింగ్ రైట్స్‌కు ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఈ సినిమాను కొనుగోలు చేసేశారు. శాత‌క‌ర్ణి త‌మిళ వెర్ష‌న్‌ను 200లకు పైగా స్క్రీన్లలో ఈ చిత్రం రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన సమాచారం బయటకు వస్తోంది. బాలయ్య సినిమా తమిళంలో హిట్టయితే మిగతా సినిమాలను వరుసగా అక్కడ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేస్తారట. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*