కాంగ్రెస్ దిక్కూ దివానం లేని పార్టీనట



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రతిపక్షాలపై కాస్తంత ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. మేడ్చల్ లో పర్యటించిన మంత్రి తలసాని కాంగ్రెస్ పై నిప్పులుచెరిగారు. అభ్యంతరకర మాటలు మాట్లాడారు. అప్పుడెప్పుడో కాంగ్రెస్‌వాళ్లు దిక్కుమాలిన జీవోలిచ్చారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీసీలను ఆదుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైందని ధ్వజమెత్తారు. కాలం కలిసొచ్చి మంత్రి అయిన తలసాని హస్తం పార్టీ అంటే ఒంటి కాలి పై లేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు దిక్కుదివానంలేని కార్యక్రమాలే చేస్తారని మండిపడ్డారు.. రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌లోగొర్రెల అభివృద్ధి పథకంపై అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగాతలసాని కాంగ్రెస్ కు ఎవరు దిక్కు లేకుండా పోయారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు మెరుగుపడుతుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు వేయించుకోలేక పోయారనే ఆందోళనలో ఆ పార్టీ నేతలున్నారు. ఇప్పడిప్పుడు పుంజుకుంటున్న హస్తం పార్టీకి గట్టిగానే కౌంటర్ లు ఇస్తున్నారు తలసాని. మొన్న టీడీపీ పై విరుచుకుపడ్డ ఆయన నేడు కాంగ్రెస్ పై అదే స్థాయి దూకుడును ప్రదర్శించారు. తెలంగాణకు తాను వ్యతిరేకమని మాట్లాడిన తలసాని టీడీపీని వీడి టీఆర్ఎస్ లోకి చేరాక మాట మార్చారు. కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందనే కంటే…అలా చేసింది కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. మొత్తంగా కాంగ్రె స్ కు నేతలెవరు లేరనే అర్థం వచ్చేలా తలసాని మాట్లాడిన మాటలు దుమారం రేపుతున్నాయి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*