నాట్స్ సంబరాలకు సిద్ధమవుతున్న వేదిక



Want create site? Find Free WordPress Themes and plugins.
అమెరికాలోని కాలిపోర్నియాలో ఉన్న బే ఏరియాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆత్మీయ సమావేశం నిర్వహించింది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు నాట్స్ ప్రతినిధులు చెప్పారు. సేవా రంగంలో ఎప్పుడు ముందుండే నాట్స్ తమ కార్యక్రమాలను మరింత విస్తరిస్తుందని తెలిపారు నాట్స్ ప్రతినిధి శ్రీనివాస్ కొమ్మినేని. భాషే రమ్యం-సేవే గమ్యం నినాదంతో తెలుగు ప్రజలంతా ముందుకు వెళ్లాలని వారు పిలుపునిచ్చారు. నాట్స్ హెల్స్ లైన్ ద్వారా ఆపదలో ఉన్న వారందరికీ సాయం అందిస్తామన్నారాయన. అమెరికాలోనే కాదు తెలుగురాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను చేస్తున్న సంగతిని సభ్యులు గుర్తు చేశారు. వరదలు, పకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తమవంతుగా ఆదుకుంటుందని చెప్పారు. పేదల కోసం ప్రత్యేక వైద్య బృందాలను పంపడం. వారికి అవసరమైన వైద్య సేవలు అందించడం జరుగుతోంది. అంతా కాదు..మిత్రులంతా కలిసి తరగతి గదుల ఏర్పాటు కోసం నిధులను సేకరించి ఇస్తున్న సంగతిని సభ్యులు ప్రస్తావించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి నాట్స్ తెలుగు సంబరాలు చేసుకుంటోంది. జూన్ 30 నుండి జులై 2వరకు చికాగోలో జరిగే నాట్స్ 5వ సంబరాలు అంగ రంగవైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నామని నాట్స్ ప్రతినిధులు చెప్పారు. ఇందుకు గాను తెలుగు ప్రజలంతా http://www.sambaralu.org/ వెబ్ సైట్స్ ద్వారా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. నాట్స్ ఆత్మీయ సమావేశంలో శ్రీనివాస్ కొమ్మి నేనితో పాటు… అశోక్ దామచర్ల, పుల్లారావు మందడపు, శశి నందిపాటి, తారక్ నందిపాటి, రాంబాబు మందడపు, వెంకట్ కొడాలి, నితీష్, అనిల్ చలసాని, సతీశ్ కె, భిరాం, అనిల్ బండి, అనిల్ చెరుకూరి, సోని, రాజేష్, సాగర్, శివ తదితరులు పాల్గొన్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*