ఏకగ్రీవం దిశగా నంద్యాల ఉప ఎన్నిక



Want create site? Find Free WordPress Themes and plugins.
నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రంగంలోకి దిగాడు. ఇందులో భాగంగా పలు పార్టీల పెద్దలతో ఆయన తనవంతు ప్రయత్నాలు ప్రారంభించాడని సమాచారం. ఇందుకు ఏపీ సి.ఎం చంద్రబాబు సుముఖంగా ఉండగా.. వైకాపా అధినేత జగన్ సమ్మతించారనే ప్రచారం జరుగుతోంది. నంద్యాల సీటును భూమా కుటుంబీకులకే కేటాయించేందుకు జగన్ ఒప్పుకున్నారంటున్నారు. ప్రధాని మోదీని కలిసొచ్చాక జగన్ స్వరం మారింది. రాష్ట్రపతి ఎన్నికల్లో కాషాయదళ అభ్యర్థికే మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో నంద్యాల ఉప ఎన్నిక కసర్తు వెంకయ్యకే అప్పగించారట ప్రధాని మోదీ. దీంతో రంగంలోకి దిగిన వెంకయ్య ఇరు పార్టీల నేతలతో  మాట్లాడారని తెలుస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ నేతలతోను ఆయన మాట్లాడతారనే చర్చ కమలం వర్గాల నుంచి వస్తోంది. అదే నిజమైతే ఇరు పార్టీలకు పండుగే. కానీ తనకు సీటు ఇస్తున్నారని.. జగన్ ఒప్పుకున్నారని గంగుల వర్గీయులు ఇప్పటికే నంద్యాలోల సంబరాలు జరుపుకుంటున్నారు. హఠాత్తుగా జగన్ ఏకగ్రీవం వైపు మొగ్గు చూపితే తమ పరిస్థితి ఏంటనే సందిగ్దంలో పడ్డారట గంగుల వర్గీయులు. కొద్ది రోజుల్లోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. పైకి ఏం చెప్పకపోయినా ఇప్పుడు వెంకయ్యనాయుడు జగన్ పార్టీతోను మాట్లాడుతుండటం ఆసక్తికర చర్చగా మారింది. హైకమాండ్ నుంచి వచ్చిన సంకేతాలతోనే జగన్ తో వెంకయ్య మాట్లాడాల్సి వచ్చిందంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమకు మద్దతు ఇస్తున్న జగన్ పార్టీతో మాట్లాడాలని సూచించారట. అమిత్ షా ఆదేశిస్తే వెంకయ్య పాటిస్తున్నారంటున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*