సొంత జిల్లాకు మూడురోజులు కేటాయించిన చంద్రబాబు



Want create site? Find Free WordPress Themes and plugins.
చిత్తూరు జిల్లాకు వచ్చిన సి.ఎం చంద్రబాబునాయుడు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రెండోరోజు రొంపిచర్ల మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నదుల అనుసంధానం వల్లే సీమకు నీరు ఇస్తున్నామని ఈ సందర్భంగా  చంద్రబాబు చెప్పారు. రొంపిచర్ల మండలం నగిరి దళితవాడలో నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు. అయ్యవాండ్లపల్లెలో రెండెకరాల్లో చెరువు తవ్వి 50 ఎకరాల మామిడి తోటలకు డ్రిప్‌తో నీటిని అందిస్తున్నారు. రూ.4 కోట్లతో చెరువులు నింపేందుకు ప్రాజెక్టు నిధులను మంజూరు చేస్తామని బాబు అన్నారు. రొంపిచర్లలో షాదీఖానా, రోడ్డు వెడల్పు కోసం నిధులు మంజూరు చేశారు. జిల్లాలో 37 శాతం తక్కువ వర్షం పడినా.. వ్యవసాయంలో 14 శాతం వృద్ధి సాధించామని సీఎం పేర్కొన్నారు. రైతులు సహకరిస్తే సంక్షోభాలను అధిగమిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకునే చంద్రబాబు అనంతరం రేణిగుంట విమాశ్రాయం నుంచి అమరావతికి చేరుకుంటారు. తన పర్యటనలో భాగంగా జిల్లాలో పార్టీని పటిష్టం చేయడంతో పాటు..వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తున్నారు చంద్రబాబు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం నేపధ్యంలో కొందరు కీలక నేతలతోను ప్రత్యేకంగా చంద్రబాబు సమావేశం కావడం ఆసక్తికరం.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*