తనకు అవమానం జరిగిందంటున్న కేఈ



Want create site? Find Free WordPress Themes and plugins.
సి.ఎం చంద్రబాబునాయుడు కంటే రాజకీయాల్లో సీనియర్ డిప్యూటీ సి.ఎం కేఈ కృష్ణమూర్తి. అలనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీదనే పోటీ చేసి గెలిచిన సత్తా ఉన్న నేత కేఈ. కర్నూలులో ఎవరు పార్టీ మారినా తాను మాత్రం తెలుగుదేశాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు. జిల్లాలో మెజార్టీ సీట్లు అన్నీ వైకాపా ఎమ్మెల్యేలు గెలిచినా..మూడు సీట్లల్లో టీడీపీ గెలిచింది. అందులో ఒకటి ప్రత్తికొండ. డోన్ ను వదిలి అక్కడ నుంచి గెలిచిన కే.ఈ కృష్ణమూర్తికి మంచి ప్రయార్టీనే ఇచ్చారు చంద్రబాబు. బీసీ కోటాకింద డిప్యూటీ సి.ఎం పదవినే ఇచ్చారు. రెవిన్యూ విభాగాన్ని ఆయన చేతిలో పెట్టారు. కానీ అమరావతి భూసేకరణ, కీలక పైళ్ల పై సంతకాలుచేసే విషయంలో అంతా మంత్రి నారాయణ, లోకేష్ లదే పై చేయి అవుతుందనే వాదన లేకపోలేదు. అప్పుడప్పుడు చంద్రబాబు తీరు పై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటాడు కేఈ. ఆ తర్వాత తాను అలా మాట్లాడలేదని మీడియా తన మాటలను వక్రీకరించిందని సర్దుకోవడం మాములే. అడుసు తొక్కనేల కడుక్కోనేల అంటూ కొందరు నేతలు అంటున్నా..పెద్దగా పట్టించుకోరాయన.

తన తమ్ముడు మాజీ మంత్రి కే.ఈ ప్రభాకర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమైనా ఆపాడు అన్న కృష్ణమూర్తి. తాజాగా తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదనే కారణంతో ప్రభాకర్…విపక్ష పార్టీ అధినేత జగన్ ను కలిశారనే ప్రచారం వచ్చింది. విషయం ఏదైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి అవమానం ఎదురైంది. జిల్లాల ఇన్‌చార్జి మంత్రుల నియామకంలో ఆయనకు చోటు దక్కలేదు. ఏ జిల్లాకూ ఇన్‌చార్జి మంత్రిగా ఆయనను నియమించలేదు. ఇప్పుడే కాదు.. గతంలోనే ఆయన చోటులేదు. కేబినెట్‌లో అందరికంటే సీనియర్‌ అయినా తనను సీఎం చంద్రబాబు పక్కనపెట్టారని ఆయన రుసరుసలాడుతున్నారట. 
                          మరో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పకు విశాఖ బాధ్యతలు అప్పగించారు. అత్త కొట్టినందుకు కాదు..తోడికోడలు తొంగి చూసినందుకనే సామెత ఉందే. సరిగ్గా అదే గుర్తు చేసుకుంటున్నారట ఇప్పుడు డిప్యూటీ సి.ఎం కేఈ. తాను పని చేయలేకపోతున్నానేమో. అందుకే తనకు జిల్లాలు అప్పగించలేదని మండిపడుతున్నారట. కేబినెట్‌ పునర్వ్యస్థీకరణలో శాఖలు మారిన మంత్రులు శిద్ధా రాఘవరావు, పరిటాల సునీతలకుజిల్లాలు ఇవ్వలేదు. బీజేపీ నుంచి వచ్చిన మంత్రులు కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావులనుపక్కన పెట్టారు. టీడీపీ-బీజేపీ విభేధాల నేపథ్యంలో ఈ ఇద్దరు మంత్రులను పక్కనపెట్టారన్న వాదనలున్నాయి. అనంతపురం ఇన్‌చార్జిగా కామినేని శ్రీనివాస్‌ స్థానంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు స్థానం దక్కింది. అందరికీ చోటు ఇవ్వడం కష్టమైన పని. అందుకే సర్దుకుపోవాలని సూచించారట మరోవైపు చంద్రబాబునాయుడు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*