అక్కడ ఎకరా రూ.42 కోట్లకు విక్రయం



Want create site? Find Free WordPress Themes and plugins.
భూముల ధరకు తిరిగి రెక్కలొస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఒక్కసారిగా తగ్గిన ధరలు తిరిగి పుంజుకుంటున్నాయి. ఇప్పుడు వాటి వేగం మరింత పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భూముల వేలం కలిసొచ్చింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం రియల్‌ ఎస్టేట్‌ రంగంపై లేదని తేలింది. ప్రభుత్వం నిర్వహించిన వేలంపాటలో భూములు రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. అక్కడ ఎకరా 42 కోట్ల 50 లక్షల రూపాయల ధర పలికింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చి చేరింది. హైదరాబాద్‌ లోని రాయదుర్గంలో, హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీకి సమీపంలో 2.84 ఎకరాలు, 2.15 ఎకరాల ప్లాట్లను వేలం వేశారు. ఏడుగురు బిల్డర్లు పాల్గొన్న వేలంపాటలో దాదాపు 5 ఎకరాలకు 185 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. చదరపు గజానికి 88 వేల రూపాయల రికార్డు ధర పలికింది. ఒక ఎకరా రికార్డు స్థాయిలో 42కోట్లకు పైగా పలకడంతో రియల్ వ్యాపారులు ఆశ్చర్యపోయారు. మళ్లీ గత రోజులు వస్తున్నాయి. మా వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా ఉండటం కాయమంటున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*