రావు రమేష్‌ అవుట్‌… ప్రకాశ్‌రాజ్‌ ఇన్‌



Want create site? Find Free WordPress Themes and plugins.
రావు రమేష్‌ ఎంతటి విలక్షణ నటుడో మనందరికీ తెలుసు… కానీ సుకుమార్‌ దర్శకత్వంలో రాంచరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం నుంచి ఆయన తప్పుకున్నారు. కారణాలు ఏవైనప్పటికీ ఆయన సినిమా నుంచి తప్పుకోవడం ఇప్పుడు అంతా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో ఆయన సమంతకు తండ్రి పాత్రలో కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఒక షెడ్యూల్‌ కూడా పూర్తయింది. షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత ఆయనను తప్పించి ఇప్పుడు ఆ స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ను తీసుకున్నట్లు సమాచారం. ఈ పాత్రకు రావు రమేష్‌ సరిపోవడం లేదని చిత్రయూనిట్‌ భావించిందట. ఏది ఏమైనా ప్రకాశ్‌రాజ్‌ గతంలో సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన జగడంలో నటించారు. ఆ సినిమా పదేళ్ల క్రితం విడుదలైంది. పదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*