చంద్రబాబు చక్రంలో ఇరుక్కున్న జగన్Want create site? Find Free WordPress Themes and plugins.
ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని చెబుతారు. సరిగ్గా ఆ సామెతను పుణికి పుచ్చుకున్నట్లున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు వారు అనుసరించిన పద్దతినే ఎంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ పై వస్తున్న పోస్టింగ్ లకు ధీటుగానే సమాధానం చెప్పాడు. వరుస అరెస్టులతో ప్రత్యర్థుల్లో వణుకు పుట్టిస్తున్నాడు. దటీజ్ చంద్రబాబు అంటున్నారు ఆ పార్టీ నేతలు. నారా లోకేష్ బీచ్ లో అమ్మాయిలతో ఫోటోలు దిగారంటూ సాక్షితో పాటు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ శాసనమండలిని కించ పరిచేలా పోస్టింగ్ చేస్తే ఊరుకోలేదు. తొలిగా పంచ్ డైలాగ్ లు పేల్చే రవికిరణ్ ను అరెస్టు జరిగిపోయింది. ఆ తర్వాత ఎమ్మెల్యే అనిత వంతు వచ్చింది. ఆమె పరువు పోయేలా పోస్టింగ్ లు చేసినందుకు గాను రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. పైకి బాగానే ఉన్నా… వైకాపాకు ఇది ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఫలితంగా సాలెగూడులో చిక్కుకున్న ఈగ‌లా జగన్ పార్టీ ప‌రిస్థితి త‌యారైంది. సాలెగూడులాంటి సోష‌ల్ మీడియానే వేదిక చేసుకుని చంద్ర‌బాబు ప‌టిష్ట‌మైన ప్ర‌ణాళిక రచించారు. జగన్ పార్టీని అదుపుచేయ‌డానికీ, దానిపై పై చేయి సాధించ‌డానికి చంద్రబాబు సర్కారుకు వ‌జ్రాయుధాల్లా దొరికాయి. మాంసం తింటున్నామ‌ని ఎముక‌లు మెడ‌లో వేసుకుని తిరిగిన‌ట్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ శ్రేణులే కాక నాయ‌కులు కూడా ఆ ఇద్ద‌రికీ ప్ర‌త్య‌క్షంగా వంత‌పాడారు. మీ వెంట మేమున్నామంటూ ఇప్ప‌టికీ పోస్టులు పెడుతున్నారు.
         మొద‌టి కేసు సంగ‌తెలా ఉన్నా.. రెండోది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు… ఇప్ప‌ట్లో తేలేది కాదు. నాన్ బెయిల‌బుల్ కేసు. పార్టీని న‌మ్ముకుని చూపిన అత్యుత్సాహం ర‌వీంద్రను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఎప్ప‌టికి బ‌య‌ట‌ప‌డ‌తాడ‌నేది కాల‌మే నిర్ణ‌యించాలి. అత‌నికి మ‌ద్ద‌తు ప‌లుకుతూ మ‌రో రెండు రోజులు పోస్టింగులొస్తాయేమో. త‌ర‌వాత విష‌య తీవ్ర‌త తెలుసుకుని వారు కూడా వెన‌క‌డుగు వేస్తారు. చంద్ర‌బాబు ప‌న్నిన వ్యూహం కార‌ణంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల‌క్ష్యం ప‌క్క‌దారి ప‌ట్టింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి మార్కండేయ క‌ట్జూ ప‌త్రికా స్వేచ్ఛ – కార్టూన్లపై ప్ర‌ధానికీ, రాష్ట్ర‌ప‌తికీ రాసిన లేఖ‌ల‌ను ప‌ట్టుకుని ప్ర‌తిప‌క్షం వేలాడింది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌తను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో జగన్ పార్టీ ఫైయిలైంది. అదే సమయంలో తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టడంలో చంద్రబాబు సక్సెస్ అవుతున్నాడు. ఓటుకు నోటు కేసు చంద్రబాబు పైన కాకుండా జగన్ పార్టీ పైవస్తే ఇప్పటికే చర్యలుండేవన్నది నిజం. ఒకటా.. రెండా వంద కేసులు వరకు వచ్చినా చంద్రబాబు చాకచక్యంగా తప్పించుకున్నారే గానీ ఏ ఒక్క దాన్లో శిక్ష పడలేదు. వ్యూహాత్మకంగా దాన్నుంచి తప్పుకోవడం ఆయనకు తెలిసినట్లుగా జగన్ కు తెలియడం లేదు. ఫలితంగా చంద్రబాబు విసిరిన వలలో జగన్ చిక్కుకుంటున్నాడు. చంద్రబాబు పై వ్య‌క్తిగ‌త క‌క్ష‌తో ఆలోచించ‌డం మానాలి. ప్ర‌జాశ్రేయ‌స్సే ప‌ర‌మావ‌ధిగా ప‌నిచేస్తేనే విజ‌యం సాధ్యం. ప‌దేప‌దే చంద్ర‌బాబు పేరును ప్ర‌స్తావిస్తుండ‌డం వ‌ల్ల ఆయ‌న‌కు ఎన‌లేని ప్ర‌చారాన్ని తెచ్చిపెడుతోంది సాక్షి మీడియా. ఒక రకంగా అది చంద్ర‌బాబుకు లాభమే. మంచి గానీ చెడుగానీ రోజు పేపర్లో నానుతున్నాడు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*