బీజేపీ టార్గెట్ తెలంగాణ మొద‌ల‌యింది….



Want create site? Find Free WordPress Themes and plugins.
బీజేపీ అనగానే ఇప్పుడు అందరికీ గుర్తుకొస్తున్న ఏకైక పేరు “నరేంద్రమోదీ”! ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ ఎక్కడ విజయం సాధించినా దానికి మోదీ ప్రభంజనంగానే లెక్కపెడుతున్నారు. మొన్న జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాలలో అధికారం చేపట్టింది. ఉత్తరప్రదేశ్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో అనూహ్య విజయం సాధించి పార్టీ శ్రేణుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఎక్కడైనా సరే… దూకుడే అన్న రీతిలో బీజేపీ దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తున్నందున 2019 ఎన్నికల్లో “టార్గెట్‌ తెలంగాణ” అన్న నినాదంతో కమలనాథులు విజృంభించబోతున్నారు. తెలంగాణలో అధికారం చేజిక్కించుకోగలమన్న ధీమాతో ఆ పార్టీ నేతలు అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా బాగా పేరున్న నేతలపై బీజేపీ దృష్టి పడింది. మోదీ మంత్రాన్ని పఠిస్తూ వారిపై ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రయోగిస్తున్నారు. తమ ప్రాధాన్యతా క్రమంలో టీఆర్‌ఎస్‌ నేతలను మొదట చేర్చారు. ఆ తర్వాత క్రమంలో కాంగ్రెస్‌, టీడీపీ నేతలను టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే, బీజేపీ ఆకర్ష్‌ వలలో మొట్టమొదట పడింది మాత్రం ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌. ఇక మిగ‌తా వారిని కూడా లాగే ప‌నిలో బీజేపీ నేత‌లు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ పార్టీలోకి వ‌స్తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. గ‌తంలో రేవంత్ రెడ్డి కూడా పార్టీలో చేర‌తార‌ని టాక్ వినిపించింది. రేవంత్ గ‌న‌క పార్టీలోకి వ‌స్తే సీఎం అభ్య‌ర్ధి అత‌నికే అని అధిష్టానం భ‌రోసా ఇచ్చింద‌ని తెలుస్తోంది. ఇలాగే న‌గ‌రానికి చెందిన కొంత మంది కాంగ్రెస్ నాయ‌కుల‌కు కూడా గాలం వేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజు త‌లుచుకున్న దెబ్బ‌ల‌కు కొద‌వేముందు….. కేంద్రంలో ఉన్న బీజేపీ త‌లుచుకుంటే ఏ నాయ‌కుడినైన త‌మ దారిలోకి తెచ్చుకోలేదా ఏంటీ మీరే చెప్పండి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*