కన్నీరు పెట్టిన కేటీఆర్



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ మంత్రి కేటీఆర్ కంటతడి పెట్టారు. మానవతా విలువులు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లల తండ్రిగా తనకు బాధ తెలుస్తుందని ప్రస్తావించారు విజయవాడలో చిన్నారి సాయిశ్రీ ఉదంతం తెలుసుకున్నాక.. ఆ వీడియో చూశాక కేటీఆర్ స్పందించారు. మరోవైపు సాయిశ్రీ ఉదంతం తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆవేదనకు గురి చేసింది. ఓ పక్క కేన్సర్ తన శరీరాన్ని తినేస్తుంటే… నాన్నా కాపాడు అంటూ తండ్రికి వాట్సాప్ వీడియో మెసేజ్ పెట్టింది సాయిశ్రీ. బతకాలని ఉంది డాడీ… చికిత్స చేయించమని వేడుకుంది. ఈ వార్త చదివిన వారు, వీడియో చూసిన ప్రతివారు కళ్ల నీళ్లు పెట్టుకున్నారు కానీ… ఆ కసాయి తండ్రి మనసు కరగలేదు. కనీసం జాడ కూడా తెలియలేదు. దీంతో నెటిజన్లు ఆతండ్రి పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వార్త తెలంగాణ మంత్రి కేటీఆర్ వరకు చేరింది.
         ఆయన పాప వీడియో, వార్త చదివి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టారు. ఆయనా ఇద్దరు బిడ్డలకి తండ్రే. అందుకే కరిగి కన్నీరయ్యారు. మానవ విలువలు పడిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్లో తన ఆవేదనను పంచుకున్నారు. విజయవాడకు చెందిన సాయిశ్రీ(12) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కన్నుమూసింది. తల్లిని, తనని వదిలి కొడుకులను తీసుకుని వెళ్లిపోయిన తండ్రి శివ కుమార్ ను ఆమె చాలా రోజులుగా చికిత్స చేయించమంటూ వేడుకుంది. చనిపోవడానికి మూడు రోజుల ముందే వాట్సాప్ లో కాపాడమని వేడుకుంటూ వీడియో పంపింది. ఆ వీడియో తల్లి సుమశ్రీ బయటపెట్టింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు తిరుగుతోంది. నాన్నా… కాపాడు అంటూ ఆ చిట్టి తల్లి చేసిన వినతిని అందరూ చూస్తు బాధపడిపోతున్నారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*