మాట మార్చిన జగన్



Want create site? Find Free WordPress Themes and plugins.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు వైకాపా అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి. జగన్ మాట చెప్పారంటే జరిగి తీరుతుందనుకున్నారంతా. మడమ తిప్పడం మా ఇంటా వంటా లేదంటారాయన. దివంగత సి.ఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతే చేశాడు. మేము వెనుక్కు తగ్గేదిలేదని ప్రస్తావించేవారు. కానీ ప్రధాని నరేంద్రమోదీని జగన్ కలిసొచ్చాక స్వరం మారింది. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికిప్పుడు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదంటున్నారు. అవసరమైతే ఆరునెలల తర్వాత అయినా తమ నేతలు రాజీనామాలు చేస్తారని చెప్పారు. 
                             రాజీనామాలు చేస్తే పార్లమెంటులో పోరాడేది ఎవరు. అందుకే రాజీనామాల గురించి పునరాలోచన చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు జగన్. పోరాటంలో ఎత్తుగడలో ఉంటాయి. ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసుండాలనే టైప్ లో మాట్లాడారాయన. ప్రత్యేక హోదా కోసం విజయసాయిరెడ్డి రాజ్యసభలో గళమెత్తిన సంగతి గుర్తు చేశారు. ఇప్పుడు లోక్ సభలోను హోదా పై చర్చ జరిగేలా వైకాపా ప్లాన్ చేస్తోంది. కానీ ఇదంతా పై పైకే. 
                             ప్రధాని మోదీని కాదని వైకాపాగానీ..టీడీపీ, జనసేన ముందుకెళ్లలేవనే వాదనుంది. ఎవరు గట్టిగా గళమిప్పినా దాచి పెట్టిన అస్త్రాలను వెలుగులోకి తీస్తారనే చర్చ సాగుతోంది. ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు ఇబ్బంది పడుతుంటే…ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ ఇరుకునపడ్డాడు. పవన్ కల్యాణ్ సరైన రాజకీయ వ్యూహం లేక తంటాలు పడాల్సి వస్తోంది. ఇలా ఎవరికి వారే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడేపరిస్థితి ఉండదు. 
                           కేంద్రం విదిల్చిన ప్యాకేజీని మ‌హాప్ర‌సాదం అంటూ చంద్ర‌బాబు స‌ర్కారు క‌ళ్లక‌ద్దుకుని సంతృప్తి చెందింది. హోదాపై ఉద్య‌మిస్తా అంటూ ట్వీట్లు పెట్టిన ప‌వ‌న్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ప్ర‌త్యేక హోదా పోరాటం కొన‌సాగుతుందని ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ అంటున్నారు. ప్ర‌ధాన‌మంత్రితో తాను హోదో గురించే 15 నిమిషాలు మాట్లాన‌ని జ‌గ‌న్ చెప్పారు. కానీ ఎంపీల రాజీనామా విష‌యంలో జ‌గ‌న్ మాట మార్చ‌డం ఆశ్చర్యమే. ఎంపీల రాజీనామా అనేది చివరి అస్త్రం అన్నారు. ముందుగా దౌత్యం, ఆ త‌రువాత లౌక్యంతో హోదాని సాధించుకోవాల‌న్నారు. పార్ల‌మెంటులో ప్రైవేటు బిల్లు పెడ‌తామ‌ని, ఆ విష‌యాన్ని స‌భ‌లో చ‌ర్చించాలంటే వైకాపా ఎంపీలు స‌భ‌లో ఉండాలి క‌దా అన్నారు. తెలుగుదేశం ఎంపీలు ఎలాగూ ఆ ప‌నిచేయ‌లేరు కాబ‌ట్టి, త‌మ పార్ల‌మెంటు స‌భ్యులు స‌భ‌లో పోరాటం చేస్తార‌న్నారు.  ప్ర‌త్యేక హోదా పోరాటంలో జ‌గ‌న్ జనాలను కలుపుకు పోలేదు. విపక్ష పార్టీలను కలుపుకు పోయి ఉంటే కేంద్రం వైపు నుంచి కొద్దిగన్నా స్పందించి ఉండేది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*