తల్లికోసం గుడి కట్టిన లారెన్స్



Want create site? Find Free WordPress Themes and plugins.
కనిపించే దైవం అమ్మ. ఆత్మీయత అమ్మ. అనురాగం, త్యాగానికి చిరునామా అమ్మ. అమ్మ అనే పిలుపులోనే తీయదనం ఉంది. తన కడుపు మాడ్చుకొని మరీ మన కడుపు నింపుతుంది. రెక్కలు ముక్కలు చేసుకొని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే మన నడతను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది. ఏ చిన్న తప్పు చేసినా కడుపులో దాచుకొని, కనికరిస్తుంది. కొడుకులు చెట్టంత ఎదిగి దూర తీరాలకేగినా, బిడ్డలు అత్తవారిళ్లకు వెళ్లినా ఆ తల్లి హృదయం వారి క్షేమం కోసమే పరితపిస్తూనే ఉంటుంది. కన్నపేగుకు ఏ చిన్న కష్టమొచ్చినా నిలువెల్లా తల్లడిల్లిపోతుంది. ఇలా తమ కోసం సర్వస్వం ధారపోసి, పెంచి పెద్ద చేసిన తల్లులను వారి జీవిత చరమాంకంలో కళ్లల్లో పెట్టుకొని కాపాడడం ప్రతి ఒక్కరి విద్యుక్త ధర్మం.
                              మాతృమూర్తిపై మమకారం అపారమైంది. విలువ కట్టలేనిది. అందుకే ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవా లారెన్స్‌ వినూత్నంగా తనప్రేమను తల్లి పై చూపించారు. అమ్మ కోసం ఏకంగా గుడిని కట్టారు. తన తల్లి కన్మనితో కలిసి లారెన్స్ ఈగుడిని ప్రారంభించడం విశేషం. తమిళనాడులోని తిరుముల్లవోయల్‌ లో ఈ ఆలయం ఉంది. నా తల్లి నాకు దైవం. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు తను ఎన్నో కష్టాలను పడింది. అందుకే అమ్మ కోసం గుడి కట్టాని చెప్పారు. అమ్మ ప్రేమకు హద్దులు ఉండవు. తన పిల్లల కోసం మాతృమూర్తి ఏమైనా త్యాగం చేస్తుంది. అటువంటి మన తల్లులను బాగా చూసుకోవాలని లారెన్స్‌ చెప్పారు. ఈ ఆలయంలో గాయత్రీదేవి అమ్మవారి విగ్రహంతో పాటు ఆయన తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. లారెన్స్ చేసిన పని చూసి చాలా మంది తల్లులు..కొడుకు అంటే ఇలా ఉండాలని చెబుతున్నారు. అయితే ఖర్చు పెట్టి మరీ గుడికట్టించమనడం కంటే..ప్రేమ కురింపించాలని చెప్పడం బాగుందంటున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*