జగన్ ను ఇరుకున పెడుతున్న టీడీపీ



Want create site? Find Free WordPress Themes and plugins.
ప్రధాని నరేంద్ర మోదీతో వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి భేటీ పై దుమారం రేగుతోంది. హస్తినకువెళ్లే వరకు జగన్ పర్యటన వివరాలను మీడియాకు ఎందుకు చెప్పలేదంటోంది టీడీపీ. మరికొద్దిసేపట్లో మోదీని కలిసేటప్పుడు మీడియాకు సమాచారం లీక్ ఇచ్చారంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అంత గోప్యంగా ప్రధానితో భేటీని ఎందుకు ఉంచాల్సి వచ్చిందో చెప్పాలనేది టీడీపీ డిమాండ్ గా ఉంది. ఒకపార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటులో సభ్యులున్న పార్టీగా జగన్ ప్రధానిమోదీని కలవడాన్ని ఎవరూ తప్పు పట్టడంలేదు. అసలు అంత హడావుడిగా కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్న. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ గతంలోనే ప్రకటించారు. కానీ ఆ పని చేయలేదు. మాట ఇస్తే తప్పనని చెబుతావు. కానీ ఇప్పుడు ఎందుకు మాట నిలబెట్టుకోవడం లేదనేది టీడీపీ నేతల ప్రశ్నగా ఉంది. వాస్తవంగా రాష్ట్రపతి ఎన్నికలు రాకపోతే తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించే పని చేసేది వైకాపా. కానీ ఇప్పుడు వారి ఓట్లు కీలకంగా మారాయి. ప్రధాని మోదీ వైకాపా మద్దతును కోరారని చెబుతున్నారు. కానీ అదెక్కడా బయట పడలేదు.
                ఎన్డీఓ కూటమిలో లేని వైకాపా తమ అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తుందనేది టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ లాంటి వారు ప్రశ్నిస్తున్నారు. వారు అడగకుండానే జగన్ ఎందుకు మద్దతు ఇచ్చారంటున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ తప్పించుకునేందుకే ప్రధాని మోదీతో భేటీ జరిగిందని మంత్రులు దేవినేని ఉమా, కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు, నారాయణ వంటి వారు విమర్శించారు. తన కుమారుడు చనిపోయిన బాధలోను నారాయణ విపక్ష నేత జగన్ ఢిల్లీ భేటీ గురించి కామెంట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామని జగన్ ఎందుకు ప్రకటించలేక పోయారంటున్నారు టీడీపీ నేతలు. దీనికి ధీటుగానే వైకాపా నేతలు కౌంటరిస్తున్నారు. సి.ఎం చంద్రబాబునాయుడు చేస్తున్నట్లు చెబుతున్న ఇసుక మాఫియా, అక్రమాల గురించి రాసిన పుస్తకం తోపాటు.. అనేక ఆధారాలను ప్రధాని మోదీకి ఇచ్చామంటున్నాయి. మరోవైపు జగన్ రహస్య పర్యటనను సిపిఎం తప్పుపడితే బీజేపీ ఏపీ శాఖ ఖండించింది. ప్రధాని మోదీని జగన్ కలిస్తే తప్పేంటి అని సోము వీర్రాజు లాంటివారు ప్రస్తావించారు. దీంతో కమలం, ఫ్యాన్ దగ్గరవుతాయనే ఊహగానాలు వినవస్తున్నాయి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*