విప‌క్షాల‌తో కోదండం.. క‌క్ష తీర్చుకునేందుకేనా!



Want create site? Find Free WordPress Themes and plugins.

తెలంగాణ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ కోదండ‌రామ్ మ‌రోసారి తెలంగాణ స‌ర్కారుపై దండ‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. ధ‌ర్నాచౌక్ ప‌రిర‌క్ష‌ణ పేరుతో మే 15న ఇందిరాపార్కు వ‌ద్ద ఆందోళ‌న‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. సిద్ధాంతాలు క‌ల‌వ‌ని కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు, టీడీపీ, బీజేపీ త‌దిత‌ర రాజ‌కీయ‌పార్టీలు.. ప్ర‌జాసంఘాల‌ను ఏక‌తాటికి తీసుకు వ‌చ్చారు. ఇటీవ‌ల గ‌న్‌పార్క్ వ‌ద్ద విప‌క్షాలంద‌రూ క‌ల‌సి ఆందోళ‌న చేప‌ట్టారు. గ‌తంలోనూ జేఏసీ సారధ్యంలో నిర‌స‌న‌లు తెలియ‌జేశారు. తెలంగాణ ప్ర‌త్యేక ఉద్య‌మంలో ప్ర‌బ‌ల‌మైన శ‌క్తిగా ఎదిగిన టీ పొలిటిక‌ల్ జేఏసీ కోదండ‌రాం మాస్టారు క‌నుస‌న్న‌ల్లో.. నాయ‌క‌త్వంలో సాగింది. ఓయూలో పోలీసుల‌పై తిరుగుబాటు నుంచి ట్యాంక్‌బండ్‌పై మిలీనియం మార్చ్ వ‌ర‌కూ.. కేసీఆర్ ఎంత‌గా ఉద్య‌మంలో శ్ర‌మించారో. ధీటుగా.. మాస్టారు కూడా గ‌ట్టిగానే నిల‌బ‌డ్డారు. యువ‌శ‌క్తిని.. ఉద్యోగ‌.. శ్రామిక వ‌ర్గాల‌ను ముందుకు న‌డ‌ప‌టంలో మాస్టారిదే అగ్ర‌స్థానం అంటూ.. ప‌లుమార్లు స్వ‌యంగా కేసీఆర్ మెచ్చుకున్నారు. 2013 జూన్ 2వ తేదీ.. కాంగ్రెస్ విభ‌జ‌న‌పై చిదంబ‌రంతో ప్ర‌క‌ట‌న ఇప్పించారు. జులై 30న ప్ర‌త్యేక తెలంగాణ ప్ర‌క‌టించారు. అంత‌వ‌ర‌కూ భుజం రాసుకుంటూ తిరిగిన కోదండ‌రాం మాస్టారు.. క‌నుమ‌రుగ‌య్యారు. ఉద్య‌మ నేప‌థ్యం అంటూ.. టీఆర్ ఎస్ ఎన్నిక‌ల బ‌రిలో నిల‌చి స‌త్తాచాటింది.. సీఎంగా కేసీఆర్ ప్ర‌మాణం చేయ‌టం అన్నీ జ‌రిగిపోయాయి. బంగారు తెలంగాణ సాధ‌న‌లో జేఏసీ, ప్ర‌జాసంఘాలు అక్క‌ర్లేద‌ని.. వాట‌న్నింటి క‌ల‌బోతే కేసీఆర్ అంటూ టీఆర్ ఎస్ శ్రేణులు  విప‌రీత‌మైన ప్ర‌చారం చేశాయి. ఏటా ల‌క్ష ఉద్యోగాలు.. కోటి ఎక‌రాల‌కు నీరంటూ.. ఆర్భాటంగా మొద‌లైన కేసీఆర్ పాల‌న మూడు హామీలు.. ఆరు వాగ్దానాలుగా మారింది. తొలిఏడాదిన్న‌ర వ‌ర‌కూ .. హ‌నీమూన్ పిరియ‌డ్‌గా వ‌దిలేసిన ప్ర‌జాసంఘాలు.. విప‌క్షాలు.. కేసీర్ స‌ర్కారుపై విమ‌ర్శ‌ల‌కు ఊత‌మిచ్చాయి. దీనికి త‌గిన‌ట్లుగానే కేసీఆర్ అండ్ కో ఎన్నిక‌ల హామీలు.. అమ‌లు క‌ష్టం అంటూ.. మా చేతిలో ఏమైనా అద్భుత దీపం ఉందా! అంటూ.. ఏకంగా అసెంబ్లీలోనే వ్యాఖ్య‌లు చేయ‌టం కూడా విప‌క్షాల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్ల‌యింది. ల‌క్ష ఉద్యోగాలు ఇవ్వ‌టం అంటే మాట‌లా.. బ‌డ్జెట్ ఎక్కడుంది. అయినా ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని మేం చెప్ప‌లేదంటూ.. కేసీఆర్ మాట మార్చ‌టం.. జేఏసీ అవ‌కాశంగా మ‌ల‌చుకుంది. నిరుద్యోగులు ఆశ‌గా ఎదురుచూసిన నోటిఫికేష‌న్స్ ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చాయి. అర‌కొర‌గా ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చినా నిరుద్యోగుల ఆశ‌ల‌ను తీర్చ‌లేక‌పోయాయి. ఇదే స‌మ‌యంలో కోదండం మాస్టారు.. జిల్లాల్లో ప‌ర్య‌టించి స‌ర్కారు తీరును ఎండ‌గ‌ట్టారు. రైతుల‌కు గిట్టుబాటు ధ‌రలేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం కూడా స‌ర్కారును ఇరుకున పెట్టింది. దీనిపై కూడా మాస్టారు ముంద‌డుగేశారు. మాస్టారు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌గానే ఏదోఒక నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చి వ‌దిలించుకుందామ‌నుకున్న టీఆర్ ఎస్‌కు.. ఇవ‌న్నీ మింగుప‌డ‌కుండా చేస్తున్నాయి. ఇటీవ‌ల భారీఎత్తున నిరుద్యోగ ర్యాలీ జ‌రిపేందుకు మాస్టారు ప్ర‌భుత్వ అనుమ‌తి కోరారు. ఇందిరాపార్కు వ‌ద్ద మిన‌హా.. ఎక్క‌డైనా ఆందోళ‌న జ‌రుపుకోమంటూ స‌ర్కారు సూచించింది. అయినా దిక్క‌రించిన మాస్టారు.. ఆందోళ‌న జ‌రుపుతామంటూ హెచ్చ‌రించ‌టంతో.. అర్ధ‌రాత్రి అరెస్ట్ చేసి ఠాణాలో నిర్బంధించింది. భ‌విష్య‌త్తులో ధ‌ర్నాచౌక్ ఉండ‌ద‌ని.. అక్క‌డ ఎటువంటి నిర‌స‌న‌ల‌కు అనుమ‌తి లేదంటూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. స‌ర్కారుపై ఏదైనా కోట్లాట‌కు దిగాలంటే.. ఊరికి దూరంగా జ‌రుపుకోమంటూ ఉచిత‌స‌ల‌హా ఇచ్చేసింది. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి.. ప్ర‌జా గొంతుక‌గా.. ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ వేదిక‌గా నిల‌చిన ధ‌ర్నాచౌక్‌ను తొల‌గించ‌టాన్ని నిర‌సిస్తూ.. మాస్టారు మ‌ళ్లీ ఆందోళ‌న‌కు సిద్ధ‌ప‌డ్డారు.తెలంగాణ ఏర్ప‌డ్డాక బ‌ల‌హీన‌మైన జేఏసీను మ‌రోసారి బ‌ల‌మైన శ‌క్తిగా మార్చేందుకు అవ‌కాశాన్ని మ‌ల‌చుకున్నారు. అన్ని విప‌క్షాల‌ను క‌ల‌సి.. మ‌రోసారి ఉద్య‌మాన్ని న‌డిపేందుకు సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఎన్నిక‌ల స‌మీపిస్తున్న స‌మ‌యంలో అధికార పార్టీను విమ‌ర్శించేందుకు విప‌క్షాల‌కు ఒక వేదిక కావాలి. కాబ‌ట్టి.. వారంతా క‌లిసొచ్చారు.. అయితే.. ఇది జేఏసీకు.. ముఖ్యంగా కోదండ‌రాం మాస్టారుకు ఎంత వ‌ర‌కూ క‌లిసొస్తుంది.. క‌క్ష తీర్చుకునేందుకు ఉప‌క‌రిస్తుంద‌నేది తెలియాలి.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*