టీ-20లో డబుల్ సెంచరీ



Want create site? Find Free WordPress Themes and plugins.
కేవలం 67 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేశాడు. అందులో 21 పోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. డబుల్ సెంచరీలో 174 పరుగులు కేవలం పోర్లు,సిక్సర్ల రూపంలోనే రావడం విశేషం. పొట్టి ఫార్మాట్ లోనే వరల్డ్ రికార్డు నమోదు చేశాడీ ముంబై బ్యాట్స్ మెన్ రుద్ర దండే. ముంబై రిజ్వీ కాలేజీకి చెందిన రుద్ర ధండే రికార్డు చూసి సచిన్ టెండూల్కర్ మురిసిపోయాడు. ముంబై యూనివర్సిటీ అంతర్ కాలేజీ క్రికెట్‌ టోర్నమెంట్‌ జరుగుతోంది. ముంబైలోని మాతుంగ జింఖానా గ్రౌండ్స్ లో రిజ్వీ, దాల్మియా కాలేజీ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో సిక్సర్ల సునామీ ఎంటో చూపించాడు రుద్ర. రిజ్వీ కాలేజీ టీమ్‌ తరపున బరిలోకి దిగిన దండే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.  ఆ తర్వాత డబుల్ సెంచరీ చేయడానికి కేవలం 28 బంతులే తీసుకోవడం విశేషం. రుద్ర వీరబాదుడుతో రిజ్వీ జట్టు 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 322 పరుగులు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దాల్మియా జట్టు 10.2 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌటైంది. 247 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది రుద్ర టీమ్. టి20లో డబుల్‌ సెంచరీ సాధించడాన్ని నమ్మలేకపోతున్నా. మాటలు రావడం లేదు. ఇలా ఆడతానని ఊహించలేదు. మా తల్లిదండ్రుల పెళ్లిరోజుకు ఇది సరైన బహుమానం. నా ప్రదర్శన పట్ల మా నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆయనే నాకు కోచ్‌. ముంబై జట్టును త్వరలోనే ఎంపిక చేయనున్నారు. అందుకే మంచి ఆట ఆడాలని నాన్న చెప్పారు. చేశానని ఆనందంగా చెబుతున్నారు రుద్ర. టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఆరాధించే రుద్ర భవిష్యత్తులో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుందాం. ఐపిఎల్ పుణ్యమా అని యువ ఆటగాళ్లు తాము ఏంటో నిరూపించుకునేందుకు మంచి వేదిక అందుబాటులో ఉంది. బెస్టాఆప్ లక్ రుద్ర.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*