తెలంగాణకు వస్తున్న జేడీ లక్ష్మీనారాయణ



Want create site? Find Free WordPress Themes and plugins.

వి.వి.లక్ష్మీనారాయణ. జేడీ లక్ష్మీనారాయణ అంటేనే అందరికీ తెలుసు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పని చేసినప్పుడు జగన్ కేసును డీల్ చేశారాయన. ఎన్ని ఒత్తిడులు వచ్చినా వెనక్కు తగ్గకుండా తన పని పూర్తి చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తిరిగి తెలుగు రాష్ట్రానికి వస్తున్నారని తెలుస్తోంది. మహరాష్ట్ర నుంచి రిలీవ్ చేసేందుకు ఇప్పటికే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.  

మహారాష్ట్ర అదనపు డిజిపీగా లక్ష్మీనారాయణ పని చేస్తున్నారిప్పుడు. తెలంగాణలో పోస్టింగ్ కు సంబంధించిన అంశం పై మాట్లాడేందుకు డిజిపి అనురాగ్ శర్మను కలిసి మాట్లాడారని కదనం. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ అంగీకరిస్తే ఆయన మళ్లీ డిప్యూటేషన్‌పై ఇక్కడకు రావడానికి అభ్యంతరం ఉండదు. డిజిపి అనురాగ్ శర్మ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారని తెలుస్తోంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకుంది. మరోవైపు టీడీపీ నేతలు కొంత మంది జేడీని  ఇక్కడకు తీసుకు రావడానికి ప్రయత్నాలు జోరుగా ప్రారంభించారని తెలుస్తోంది. నిజాయితీగల అధికారిగా పేరున్న జేడీ లక్ష్మీనారాయణ తెలంగాణకు వస్తే పలు కేసులను జాగ్రత్తగా డీల్ చేస్తారంటున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*