వైసీపీ.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ఎవ‌రో తెలుసా!



Want create site? Find Free WordPress Themes and plugins.

యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) 2009లో అప్ప‌టి సీఎం వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణం త‌రువాత త‌లెత్తిన పరిస్థితుల్లో నెల‌కొల్పిన రాజ‌కీయ పార్టీ. తండ్రి మ‌ర‌ణంతో అప్ప‌టికే క‌డ‌ప ఎంపీగా వున్న వైఎస్ త‌నయుడు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డినే సీఎంగా చేస్తార‌ని అంద‌రూ భావించారు. కాంగ్రెస్ పార్టీలో ఓ వ‌ర్గం మాత్రం.. జ‌గ‌న్‌ను వ్య‌తిరేకించాయి. చిన్న‌వ‌య‌సుకే సీఎం కావాల‌నే జ‌గ‌న్ కోరిక‌ను తీర్చేందుకు 21 మంది ఎమ్మెల్యేలు అండ‌గా నిలిచారు. కాంగ్రెస్‌లో ఢిల్లీ హైక‌మాండ్‌దే అంతిమ‌నిర్ణ‌యం కావ‌టంతో జ‌గ‌న్ కోరిక తీర‌లేదు. పైగా.. రాజ‌కీయాల్లో పండిపోయిన అప్ప‌టి ఆర్ధిక‌మంత్రి కొణిజేటి రోశ‌య్య‌ను సీఎం చేశారు. దీంతో జ‌గ‌న్ వ‌ర్గంలోని ఎమ్మెల్యేలు కొంద‌రు రాజీనామా చేశారు. దీంతో జ‌గ‌న్ కాంగ్రెస్‌పై తిరుగుబావుటా ఎగుర‌వేశారు. వైఎస్సార్ సంక్షేమ ప‌థ‌కాలు.. రైతులు, పేద‌, మైనార్టీ వ‌ర్గాల్లో వున్న సానుభూతిని అవ‌కాశంగా జ‌గ‌న్‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు రూప‌క‌ల్ప‌న చేశారు. శివ‌కుమార్ పేరుతో పార్టీ ఎన్నిక‌ల సంఘంలో రిజిస్ట‌రైంది. ఆ త‌రువాత ఉప ఎన్నిక‌ల్లో గెలుపు.. వైసీపీను మ‌రింత దూకుడు పెంచేలా చేసింది. అదే జోరు కొన‌సాగించేందుకు వైఎస్ మ‌ర‌ణించిన స‌మ‌యంలో ప్రాణాలు కోల్పోయిన అభిమానుల‌ను ఓదార్చేందుకే ఓదార్పు యాత్ర సిద్ధం చేశారు. అప్ప‌టికే జ‌గ‌న్ మెడ‌కు ఉచ్చుగా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. క్విడ్‌ప్రో లెక్కన కోట్లు కూడ‌బెట్టి.. ప్ర‌తిఫలంగా ఏపీ, తెలంగాణాల్లో కోట్లాదిరూపాయ‌ల విలువైన భూములు పందేరం చేసిన‌ట్లు సీబీఐ కేసులు న‌మోదుచేసింది. 

   అనంత‌రం జ‌గ‌న్ జైలుక‌ళ్ల‌టం. అన్నీ జ‌రిగిపోయాయి. ఆ స‌మ‌యంలో చెల్లి ష‌ర్మిల‌.. జ‌గ‌న‌న్న బాణాన్నంటూ.. ఓదార్పుయాత్ర‌తో ఆక‌ట్టుకుంది. 2014 ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్ జైలు నుంచి బెయిల్‌పై విడుద‌ల కావ‌టంతో సానుభూతి.. టీడీపీపై వ్య‌తిరేక‌త క‌లిసొస్తాయ‌ని భావించినా.. 175 స్థానాల్లో 67 సీట్ల‌కే ప‌రిమిత‌మ‌వ్వాల్సి వ‌చ్చింది. ప‌వ‌న్ జ‌న‌సేన దెబ్బ‌తో అధికారం కోల్పోయిన‌ట్లు లెక్క‌లు వేశారు. 2019లో ఆ ప‌రిస్థితి ఎదుర‌వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో.. ప్ర‌ముఖ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా పేరున్న ప్ర‌శాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని స‌మాచారం. సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌తోపాటు.. ఆరోగ్య సేవా కార్య‌క‌ర్త‌గా ప‌నిచేశారు. ఐక్య‌రాజ్య‌స‌మితిలోని ఓ విభాగంలో ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. రాజ‌కీయంగా.. సామాజికంగా మంచి అవ‌గాహ‌న వున్న వ్య‌క్తి. గ‌తంలో బీహార్ ఎన్నిక‌ల్లో నితీష్‌కుమార్‌కు.. రాజ‌కీయ వ్యూహాలు.. ప్ర‌తివ్యూహాల్లో ప్ర‌శాంత్ ఆలోచ‌న‌లే కీల‌క‌మ‌య్యాయి. అక్క‌డ అధికారం నితీష్ వ‌శం అయ్యేందకు స‌హ‌క‌రించాయి. అదే ధీమాతో ఏపీలో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపేందుకు వైసీపీ నేత‌లు.. రంగం సిద్ధం చేశారు. ప్ర‌చారం.. ఎత్తులు. వ్యూహాలు.. స‌ర్వేలు.. ఇవ‌న్నీ  చేయ‌టం.. ఓవ‌రాల్ గా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి రాజ‌కీయంగా కావాల్సిన సాయంతో పాటు.. సీఎం అధికారం ద‌క్కేంత వ‌ర‌కూ ఏమేమి చేయాల‌నే అంశాల‌న్నీ ప్ర‌శాంతే దిశానిర్దేశం చేయ‌నున్న‌ట్లు ఊహాగానాలు పెరిగాయి. అక్ష‌రాలా.. రూ.250 కోట్ల డీల్‌తో.. వ్యూహ‌క‌ర్త డీల్‌ కుదిరిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



1 Comment

Leave a Reply

Your email address will not be published.


*