శ్రీలంకకు వెళుతున్న మోదీ



Want create site? Find Free WordPress Themes and plugins.
ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటనకు వెళుతున్నారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. బౌద్ధులు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వేసక్‌ (సింహళీయుల బుద్ధ పూర్ణిమ) ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ వేడుకలకు వంద దేశాల నుంచి 400 మంది వరకు ప్రతినిధులు హాజరు కానున్నారు. బౌద్ధుల కాలమానం ప్రకారం బుద్ధ పౌర్ణిమకు అత్యంత ప్రాధాన్యం ఉంది. బుద్ధుని జననం, ఇంటి నుంచి బయటకు వెళ్లడం, జ్ఞానోదయం, బోధన, మహాభినిష్కమణ, నిర్వాణాలకు సంబంధించిన అంశాలను స్మరించుకుంటారు బౌద్దులు. బుద్దుని ఉత్సవాలకు హాజరయ్యే మోదీ శ్రీలంక నాయకులతో భేటీ కానున్నారు. శ్రీలంకలోని తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన కేండీ ప్రాంతాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. భారత్-శ్రీలంకల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మోదీ పర్యటన దోహదపడనుంది. సముద్ర జలాల్లో మత్సకారులు నిబంధనల ఉల్లంఘన అంశంపై మరోసారి ప్రధాని మోదీ శ్రీలంక ప్రతినిధులతో మాట్లాడనున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*