పోటీ పడుతున్న తెలుగు ఐటీ మంత్రులు



Want create site? Find Free WordPress Themes and plugins.
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హస్తిన బాటలో ఉన్నారు. అక్కడ వివిధ దేశాల కంపెనీల ప్రతినిధులతో భేటీ జరపనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే గూగుల్ తో పాటు..పలు కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. ఏపీనే కాదు మేము తక్కువేం తినలేదంటున్నారు మరోవైపు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. పలు దేశాల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమావేశం అయ్యారు. దక్షిణ కొరియా రాయబారి చో హ్యూన్‌ను కేటీఆర్‌ కలిశారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం, పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు. అంతే కాదు… తైవాన్ ఆర్ధిక వ్యవహారాల శాఖ మంత్రి మే హువాంగ్, ఎలక్ర్టానిక్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యారు.  వచ్చే అక్టోబర్‌లో తైపీలో జరిగే పారిశ్రామికవేత్తల సమావేశానికి హాజరుకావాలని మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు తైవాన్ ప్రతినిధులు. ఐటీలో హైదరాబాద్ కు ఉన్న ఖ్యాతిని మరింత పెంచేందుకు కేటీఆర్ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. అవసరమైతే విదేశాలకు వెళ్లి మరీ ఐటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు కేటీఆర్. తెలుగు రాష్ట్రాల సి.ఎంలు కుమారులిద్దరు ఐటీ మంత్రులు కావడం ఒక ఎత్తయితే..వారిద్దరు తమ శాఖ పై పట్టు సాధించడమే కాదు..పెట్టుబడులను రప్పించేందుకు పోటీ పడటం ఇప్పుడు హాట్ టాపికైంది. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు నేతలు పోటీపడినా కేటీఆర్ దే పైచేయి అయింది. లోకేష్ తిరిగిన ప్రాంతాల్లో టీడీపీ పూర్తిగా ఓడింది. ఈ సారి ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాలి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*