తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం రేసు మొద‌ల‌య్యింది…



Want create site? Find Free WordPress Themes and plugins.
2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదుకానీ.. నాయకులు మాత్రం ఇప్పటి నుంచే కుర్చీ పదిలపరచుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ పవర్‌లోకి వస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకోవడం కోసం చాపకింద నీరులా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. సొంత బలం పెంచుకోవడంతో పాటు పోటీ నేతలను బలహీనపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి అవ్వాలని ఎవరికి మాత్రం ఉండదు..? పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాలన్న కోరిక చాలా మంది నేతల మనసులో ఉంది. సీఎం పదవిని ఇష్టపడుతున్నవారు ఎంత మంది ఉన్నా.. ఓ నలుగురైదుగురి పేర్లు మాత్రమే ప్రముఖంగా వినిపిస్తున్నాయి.. చర్చల్లోకి వస్తున్నాయి. అందులో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. పీసీసీ చీఫ్‌గా ఉండటం.. కార్యక్రమాలను లీడ్‌ చేస్తుండటంతో సహజంగానే ఆయన పేరు ఎక్కువగా ప్రచారంలో ఉంది. అదే సమయంలో సీనియర్‌ నేతలు జైపాల్‌రెడ్డి.. జానారెడ్డిలు కూడా అంతే స్థాయిలో పోటీలో ఉన్నారు. వీరెవరూ నోరు తెరచి తాము సీఎం రేసులో ఉన్నామని ఏనాడు చెప్పుకోలేదు.. చెప్పుకోరు కూడా!  కానీ, అంతర్గతంగా మాత్రం అందుకు తగ్గ కార్యచరణ రూపొందించుకుంటుంటారు. ఇప్ప‌టికే తెలంగాణలో కాంగ్రెస్‌ను బాహుబ‌లిని నేనే అంటూ వీహెచ్ చెప్ప‌క‌నే తాను సీఎం రేసులో ఉన్న‌ట్టు తెలిసేలా చేశాడు. ఇలా ఎవ‌రికి వారు సీఎం రేసులో తామున్నాము అంటూ అధిష్ఠానికి సంకేతాలు పంపిస్తూనే ఉన్నారు. అంతే కాదు డిగ్గి రాజాకు మెయిల్స్ కూడా పెడుతున్నార‌ట‌. ప‌ర్స‌న‌ల్‌గా అపాయింట్ మెంట్ కావాలంటూ నేత‌లు దిగ్విజ‌య్‌సింగ్‌ను కోరుతున్నార‌ట‌. ఆలు చూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్న చంద్రంగా తెలంగాణ‌లో పార్టీ గ‌ట్టెక్కుతుందో లేదో తెలియ‌దు కాని కాంగ్రెస్‌లో మాత్రం అప్పుడే సీఎం గోల మొద‌లైంది క‌దా అని విశ్లేష‌కులు అంటున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*