తెలంగాణ కాంగ్రెస్ ఎన్నారై సెల్ ఏర్పాటు



Want create site? Find Free WordPress Themes and plugins.
టీ.కాంగ్రెస్ ఎన్నారై సెల్ ను ఏర్పాటు చేసింది పిసిసి. ఈ మేరకు గాంధీభవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలువురు పిసిసి నేతలు ఎన్నారైలతో మాట్లాడారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా 50మంది ఎన్నారైలు కాంగ్రెస్ కు మద్దతునిచ్చారు. ఆ తర్వాత పిసిసి నేతలు మల్లు రవి  అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎన్నారై చైర్మన్  బి. వినోద్ కుమార్, కల్వకుర్తి ఎమ్మెల్యే  చల్లా వంశీ చందర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు దాసోజు శ్రవణ్ ,టీపీసీసీ అధికార ప్రతినిధి మహేష్ కొనగల వారితో మాట్లాడి విధివిధానాలను చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఖ్యాతిని మరింతగా తీసుకెళ్లాలని వారినికోరారు. టిపిసిసి వర్కింగ్  ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క , ఏఐసీసీ  సెక్రటరీ మధు యాష్కి లు  ఫోన్ ద్వారా వారితో మాట్లాడారు. సామాజిక సేవ లోటీ కాంగ్రెస్ ఎన్నారై విభాగం బాగా సేవలందించాలని వారు పిలుపు నిచ్చారు.  అలాగే లండన్ నుండి ఎన్నారై కో-ఆర్డినేటర్  గంప వేణుగోపాల్ వారికి మద్దతుగా మాట్లాడారు. సిడ్నీలోని ఎన్నారై విభాగం చేసే పనులకు ఎప్పుడు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం కొత్త కమిటీని ఎన్నికున్నారు. ఎన్నారై విభాగం ఛైర్మన్ గా డాక్టర్ బి. వినోద్, కన్వీనర్ గా మన్యం రాజశేఖర్ రెడ్డి, కో-కన్వీనర్ గా మేక దేవి ప్రసాద్ రెడ్డి, కమిటీ మెంబర్లు గా శ్యామ్ ప్రసాద్, ఇమ్రాన్ మొహమ్మద్ ,ఉదయ్ కిరణ్ ,రాంబాబు , సంజయ్ గౌడ్ లను నియమిస్తున్నట్లు ప్రకటించారు.కొత్త కమిటీకి  పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*