పొలిటిక‌ల్‌.. గేమ్‌లో కేజ్రీవాల్ విల‌విల‌!Want create site? Find Free WordPress Themes and plugins.

అన్నాహ‌జారే స్పూర్తితో అవినీతిపై.. స‌మ‌రం చేసి ఢిల్లీ గ‌ద్దె నెక్కిన ఆప్ అధినేత సీఎం కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. మొన్న పార్టీ ప్ర‌చారానికి స‌ర్కారు నిధిని వాడ‌టంపై కోర్టు మొట్టికాయ‌లు వేసింది. ఆ డ‌బ్బును ఆయ‌నే చెల్లించాలంటూ ఆదేశించింది. నిన్న‌.. ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. దీనిపై సొంత‌పార్టీ నేత‌లే మండిప‌డ్డారు. ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు త‌మ నేత అస‌మ‌ర్ధ‌త వ‌ల్ల ఓడామంటూ విమ‌ర్శించారు. ఇక అన్నాహ‌జారే.. అయితే ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌టం వ‌ల్ల‌నే ఆప్ పార్టీకు ఓటేయ‌లేదంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు.. ఏకంగా ఏ అవినీతిని అంత‌మొందిస్తామ‌ని.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చారో.. అదే అవినీతికి ఆప్ నేత సీఎం కేజ్రీవాల్ పాల్ప‌డ్డార‌ని.. దానికి తానే ప్ర‌త్య‌క్ష సాక్షినంటూ ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడు.. ఉద్వాస‌న‌కు గురైన మంత్రి క‌పిల్ శ‌ర్మ ఈ ఆరోప‌ణ‌లు చేయ‌టం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ఢిల్లీలో వాట‌ర్ ట్యాంక‌ర్ల య‌జ‌మానుల నుంచి రూ.2 కోట్లు లంచం తీసుకోవటానికి తానే ప్ర‌త్య‌క్ష సాక్షినంటూ.. పెను బాంబు పేల్చారు.కేజ్రీవాల్‌కు  సత్యేంద్ర జైన్‌  రూ.2 కోట్లు నగదు ఇస్తుండడాన్ని నా కళ్లతో నేను స్వయంగా చూశా. ఇదేమిటని నేను కేజ్రీవాల్‌ను అడిగినప్పుడు ఇలాంటివి రాజకీయాల్లో జరుగుతుంటాయంటూ లైట్ తీసుకోమ‌న్నారంటూ తెగ ఫీల‌య్యారు పాపం. సీసం చుట్టాకు చెందిన కోట్లాదిరూపాయ‌ల విలువైన భూ వివాదాన్ని  జైన్ పంచాయ‌తీ చేశారంటూ చెప్పారు.  రెండేళ్ల పాటు కేబినెట్‌లో ఉన్న తాను.. అవినీతిని క‌ళ్లారా చూశాన‌ని.. ఆ అక్ర‌మాల‌ను భ‌రించ‌లేక ప్ర‌శ్నిస్తే.. త‌న ప‌ద‌వి తొల‌గించారంటూ  చెప్పారు.  అక్ర‌మాల‌కు కేంద్ర‌మైన ఢిల్లీ స‌ర్కారు కొన‌సాగ‌టానికి వీల్లేద‌ని.. వెంట‌నే కేజ్రీవాల్ రాజీనామా చేయ‌లంటూ  భాజపా దిల్లీ శాఖ అధ్యక్షుడు మనోజ్‌ తివారి డిమాండ్ చేశారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కలిసి వెంటనే కేజ్రీవాల్‌ను  సీఎం ప‌ద‌వి  నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. రెండేళ్లుగా.. ఆప్‌కు ఎదుర‌వుతున్న ఎదురుదెబ్బ‌లు.. స్వ‌యం త‌ప్పిదాలా! రాజ‌కీయ వ్యూహంలో అధికార పార్టీ బీజేపీ చేస్తున్న ప‌న్నాగ‌మా! అనే అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఢిల్లీలో ప‌ట్టు సాధించి.. సీఎంగా త‌న‌ను తాను నిరూపించుకోవాల్సిన కేజ్రీవాల్‌.. జాతీయ‌స్థాయి రాజ‌కీయాల్లో ఎద‌గాల‌నే ల‌క్ష్యం.. బీజేపీను క‌ట్ట‌డి చేయాల‌నే ప్ర‌ణాళిక లేని ఆలోచ‌న‌తో త‌ప్పు చేశారంటూ.. ఆప్ నేత‌లు త‌మ నాయ‌కుడిని విమ‌ర్శిస్తున్నారంటే.. ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు

Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*