అమెరికాలో బిజీ బిజీగా చంద్రబాబు టీమ్



Want create site? Find Free WordPress Themes and plugins.
అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రముఖ కంపెనీల అధినేతలతో మాట్లాడుతున్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టడంతో పాటు..ఆయా కంపెనీలు రాజధానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పలుకంపెనీల సీఈఓలతో చర్చలు జరుపుతున్నారు. గూగుల్‌ ఉపాధ్యక్షుడు టామ్‌ మూర్‌.. చంద్రబాబుతో భేటీ అయి గూగుల్‌ ప్రస్తుత ఆవిష్కరణల గురించి వివరించారు. ఆతర్వాత  ప్లెక్స్‌ ట్రానిక్స్‌ సీఈవో మైక్‌ మెక్‌ సమరతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో వనరుల గురించి వివరించి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దీనిపై స్పందించిన మైక్‌ మెక్‌ విశాఖలో ఇప్పటికే తమ కంపెనీ ఉందని గుర్తుచేశారు. భారత్‌లో సంస్థ విస్తరణకు గల అవకాశాలను పరిశీలిస్తామన్నారు. మరికొన్ని కంపెనీల ప్రతినిధులతోను చంద్రబాబు మాట్లాడనున్నారు. మంత్రి నారా లోకేష్ చివరి నిమిషంలో తప్పుకోవడంతో సి.ఎం చంద్రబాబుతో కూడిన బృందం అమెరికా వెళ్లింది. అక్కడి ఎన్నారైల బృందం  చంద్రబాబుటీమ్ కు ఘనస్వాగతం పలికింది. రేపు టెక్సాస్ , 7న కాలిఫోర్నియాలో జరిగే ప్రవాసాంధ్రుల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. అంతే కాదు..అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు..ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వారిని కోరనున్నారు చంద్రబాబు. ఈ మేరకు చంద్రబాబు అమెరికాలో జరపనున్న పర్యటనను విజయవంతం చేసేందుకు ఎన్‌ఆర్‌ఐ-టీడీపీ విభాగం ఏర్పాట్లు చేసింది. ‘యూఎస్‌ వెల్‌కమ్స్‌ సీబీఎన్‌’ అంటూ పోస్టర్లు రూపొందించి, ఆంధ్రులు అధికంగా నివసించే ప్రాంతాల్లో ప్రచారం చేసింది. ఎన్‌ఆర్‌ఐ-జన్మభూమి కమిటీ సమన్వయకర్త లెక్కల వెంకటేశ్వరరావు చంద్రబాబు పర్యటన వివరాలను మీడియాకు తెలిపారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*