కుక్కలకి భూములిస్తారా అంటూ మండిపడ్డ రేవంత్



Want create site? Find Free WordPress Themes and plugins.
టీడీపీ నేత రేవంత్ రెడ్డి తన దూకుడును పెంచారు. ఓటు నోటు కేసు వచ్చాక కాస్త తగ్గినట్లు కనిపించినా… ఆ తర్వాత స్వరం మారింది. రోజు రోజుకు సిఎం కేసీఆర్ పై విమర్శల తాకిడి పెంచారు. కుక్కల పెంపకానికి సినీనటి అమలకు జూబ్లీహిల్స్ లో మూడెకరాలు భూమి ఇస్తారా అంటూ ప్రశ్నించారాయన. అంతే కాదు.. అమల కోడలు సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తారా అంటూ ఎదురు దాడి చేశారు. కేంద్రం ప్రకటించిన ఐఐటిఆర్ కు కృష్ణా జిల్లాకు చెందిన లండన్ శ్రీనివాస్ అనే వ్యక్తిని సి.ఈ.ఓ.గా నియమించారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఆ పదవికి తెలంగాణ వారే లేరా అన్నారు టీడీపీ నేత. మెట్రో రైల్ సి.ఎమ్.డి గా ఉన్న ఎన్.వి.ఎస్.రెడ్డి రాజమండ్రికి చెందినవారు. ఆయన పదవీకాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించారని గుర్తు చేశారు రేవంత్.
      ఆంధ్రవారిని ఈ ఉద్యోగాలలో ఎందుకు నియమిస్తున్నారో అర్థం కావడంలేదని విమర్శించారు రేవంత్ రెడ్డి. ఆంధ్ర కుక్కలకు ఉన్న విలువ తెలంగాణ బిడ్డలకు లేదా అని రేవంత్ కాస్త ఘాటుగానే విమర్శల దాడి చేశారు. రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇవ్వలేక అలాగని ఊరుకోలేక టీఆర్ఎస్ నేతల మథనపడుతున్నారు. టీడీపీ నేత కామెంట్లు నేరుగా కేసీఆర్ పైనే పెట్టడంతో తాము ఖండనలు ఇవ్వడం కంటే సి.ఎంనే ఆ పని చేయాలంటున్నారు. రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఇస్తే అతన్ని గొప్ప లీడర్ గా తయారు చేసినట్లు అవుతుందని.. అందుకే లైట్ తీసుకోవాలని గులాబీ సీనియర్లుచెబుతున్నారట.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*