ఆంధ్రజ్యోతికి క్యూ కడుతున్న నేతలు 



Want create site? Find Free WordPress Themes and plugins.
హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలో ఉన్న ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి ప్రమాదం పెరగకుండా నివారించారు. ఇంత కంటే మంచి సమయం రాదనుకున్నారో ఏమో నేతలంతా అక్కడికి రావడం చూడటం షరా మాములైంది. తొలిగా తెలంగాణ సి.ఎం కేసీఆర్ ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అడుగు పెట్టారు. ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో మాట్లాడారు. జరిగిన నష్టంపై ఆరా తీశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోను.. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఏబీఎన్ పై సి.ఎంతో పాటు.. టీఆర్ఎస్ నేతలు మండిపడిన సంగతి తెలిసిందే. కేసీఆర్ చేపట్టిన యజ్ఞానికి హాజరై తమ మధ్య ఉన్న అభిప్రాయభేదాలకు పుల్ స్టాప్ పెట్టారు రాధాకృష్ణ. అప్పటి వరకు కలానికి సంకెళ్లు పేరుతో ప్రత్యేక కాలమ్ రాసే ఆంధ్రజ్యోతి పత్రికా యాజమాన్యం ఆ పనికి పుల్ స్టాప్ పెట్టింది. తెలంగాణ సర్కారు తీరుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వారు వెనక్కు తగ్గారు. మరోవైపు మీడియా పై నియంత్రణ మంచిది కాదని కేంద్రం చెప్పేంతవరకు వివాదం వెళ్లింది. చివరకు సమిసి పోయింది. విషయం ఏదైనా ఆంధ్రజ్యోతిలో సి.ఎం చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా ఒక్క వార్త రాదనే ప్రచారముంది. అసలు జ్యోతిలో చంద్రబాబు పెట్టుబడులు పెట్టారానే పుకార్లు వచ్చాయి. అందుకే గులాబీ నేతలు ఆంధ్రజ్యోతితో పాటు.. రాధాకృష్ణకు వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం వచ్చింది. అసలు ఆంధ్రజ్యోతి ఆంధ్రా పేపర్ అని ముద్ర ఉంది. ఆ పేపర్ లో సీఎం కేసీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వస్తాయనే పేరుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో.. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఆ పేపర్ కుట్రలు పన్నిందనే ఆరోపణలూ లేకపోలేదు. అలాంటి పత్రిక కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా సందర్శించడం సంచలనంగా మారింది.
       తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్రా పాలకులపై నిప్పులు చెరిగిన కేసీఆర్.. దినపత్రికలను కూడా వదలని విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రికపై ఆయన బహిరంగంగానే పలుమార్లు నిప్పులు చెరిగారు. తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెబుతామని కూడా హెచ్చరించారు. ఆ పత్రిక గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆరే.. ఇప్పుడు.. ఆ పేపర్ కార్యాలయాన్ని సందర్శించడం హాట్ టాపిక్ గా మారింది. రానున్న కాలంలో ఆంధ్రజ్యోతి పత్రికలో కేసీఆర్ కు వ్యతిరేకంగా వార్తలు రావనే కొత్తవాదన తెరపైకి వచ్చింది. ఒకప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికను పక్కన పెట్టాలని డిమాండ్ చేసినవారే ఇప్పుడు ఆ పత్రికపై మక్కువ చూపించడం వెనుక కథ వేరే ఉందంటున్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కు మీడియాతో అవసరముంది. ఈనాడు అధినేత రామోజీరావు వద్దకు వెళ్లి మరీ కలిసొచ్చారు కేసీఆర్. ఇప్పుడు వేమూరి రాధాకృష్ణ వంతు వచ్చింది. ముందస్తుగానే కలవడం వల్ల ఇబ్బంది ఉండదనే ఆలోచనతోనే ఈ పని చేశారంటున్నారు. కేసీఆర్ వెళ్లిన సంగతి తెలుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వెళ్లారు. ఎండీ రాధాకృష్ణతో మాట్లాడారు. ఆ తర్వాత టీపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ, కమ్యూనిస్టు నేతలు ఇలా వరుస పెట్టి ఆ పత్రికా కార్యాలయానికి వస్తున్నారు. పరామర్శిస్తున్నారు. ఇదంతా రాబోయే కాలంలో తమకు ఇబ్బంది రాకుండా చేసుకునేందుకు అనే ప్రచారం సాగుతోంది. విషయం ఏదైనా ఆంధ్రజ్యోతికి విలువ మరింత పెరుగుతుందన్నది వాస్తవం.   
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*