రఘవీరారెడ్డిని సి.ఎం చేయాలనే ప్రతిపాదన



Want create site? Find Free WordPress Themes and plugins.
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పాతాళానికి పోయింది. అసలు తిరిగి కోలుకుటుందో లేదో తెలియదు. విభజన పాపం మూటకట్టుకున్న హస్తం పార్టీకి అక్కడ దిక్కు లేకుండా చేశారు ఓటర్లు. ఇప్పుడే కాదు.. భవిష్యత్ లోను కాంగ్రెస్ కు పుట్టగతులుండవనే వాదనుంది. అయినా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే ధీమాతో ఉన్నారు ఆ పార్టీ నేతలు. తెలుగు వారిని నిలువునా చీల్చిన సోనియాగాంధీ పార్టీని ప్రజలు అంత తేలికగా మర్చి పోరు. అలాంటి పార్టీలో ఇప్పుడు కొత్త ప్రతిపాదన తెర ముందుకు వచ్చింది. అదేంటి అంటే సీఎంగా ర‌ఘువీరాను ప్ర‌తిపాదించేశారు. పీసీపీ చీఫ్ త‌మ త‌రుపున కాబోయే సీఎంగా ఉంటార‌నే ప్ర‌చారం ప్రారంభించార‌ు. వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రఘువీరారెడ్డి పేరును పరిశీలించాలని హైకమాండ్ ను కోరారు. టీడీపీలో చంద్రబాబు సుప్రీమ్, వైసీపీలో జగన్ అన్నీ తానే చూసుకుంటాడు. ఇక కాంగ్రెస్ లో అలాంటి వ్యక్తి లేరు. అందుకే సి.ఎం అభ్యర్థిని ముందే ప్రకటించాలని ఆ పార్టీ నేతలు కోరారు 
        ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన పీసీసీ వర్క్‌షాపులో తీర్మానించారు. ఏపీ కాంగ్రెస్ కు ఎన్‌. రఘువీరారెడ్డి కంటే గట్టి నేత ఉండరని చెప్పారు. కాంగ్రెస్‌ తరుఫున సీఎం అభ్యర్థిగా రఘువీరారెడ్డి పేరును ప్రకటిస్తే రాష్ట్రంలో పార్టీకి సానుకూల ఫలితాలు వస్తాయని తులసిరెడ్డి లాంటి నేతలు ప్రస్తావించారు. ఏ పార్టీతోను పొత్తు లేకుండానే 2019 ఎన్నికలకు వెళుతున్నామని ఇందుకు అంతా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా రఘవీరా పిలుపునిచ్చారు. జూన్ 7న పీసీసీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. టీడీపీ పాలనకు వ్యతిరేకంగా జరిగే ఇలాంటి కార్యక్రమాలను క్యాడర్ సద్వినియోగం చేసుకోవాలని కోరారాయన. రఘవీరారెడ్డి పిలుపు బాగానే ఉంది. కానీ పట్టించుకునే వారే కరువయ్యారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైనా పిలుపునిస్తే పెద్ద సంఖ్యలో నేతలు, క్యాడర్ వచ్చేది. ఇప్పుడు కార్యక్రమాలకు రావడం కాదు. ఎవరైనా లీడర్లు అటువైపు వస్తే సిగ్గులేదు.. విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ పక్షాన వస్తావా అంటూ ప్రజలే తిట్టిపోస్తున్నారు. అది ఏపీలో కాంగ్రెస్ పార్టీకి దక్కే గౌరవం.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*