గులాబీ నేతలు టచ్ లో ఉన్నారట



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణలో విపక్ష పార్టీలకు చెందిన నేతలు చాలా మంది టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్, టీడీపీ, ఎస్పీ లకు చెందిన ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలకు ముందుగా వారిలో చాలా మంది తిరిగి సొంత గూటికి వస్తారని చెప్పారు టీపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తమతో వారు టచ్ లో ఉన్నారని చెప్పారు ఉత్తమ్. ఎన్నికలకు ఏడాది ముందు వారంతా తిరిగి తమ పార్టీకి వస్తారని చెప్పారు. కేసీఆర్ కుటుంబీకులు తప్ప మిగతా వారు ఆ పార్టీలో ఉండరని జోస్యం చెప్పారు ఉత్తమ్. తన గడ్డం గురించి మాట్లాడకుండా టీఆర్ఎస్ నేతలు ఉండరని వ్యాఖ్యానించారు ఉత్తమ్. టీఆర్‌ఎస్‌ నుంచి ఊహించని స్థాయిలో కాంగ్రెస్‌లోకి వలసలు ఉంటాయన్నారు. తెలంగాణలో బీజేపీకి అంత సీన్‌ లేదన్నారు. వరంగల్ సభలో బీజేపీ గురించి సి.ఎం కేసీఆర్ మాట మాత్రం ప్రస్తావించలేదన్నారు. ఒకవేళ కమలం పార్టీకి ప్రజల్లో పట్టు ఉంటే అధికార పార్టీ అధినేత వదిలేవారు కాదని గుర్తు చేశారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు వెళ్లిన సీనియర్లు ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంతనాలు ఆడారనే చర్చ సాగుతోంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఉత్తమ్ మాటలుండటం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.  
వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ నుంచి ఎవరు సీఎం అభ్యర్థి అంటే మంత్రివర్గమంత జాబితా తయారువుతున్న నేపథ్యంలో తమ పార్టీని జనాల్లోకి పాజిటివ్ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఆ క్రమంలోనే వివిధ అంశాలను ఎంపిక చేసుకుని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా రైతులు, యువత ఎదుర్కొనే సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దానితోపాటు తమకు బలమైన నాయకులు గులాభి కండువా కప్పుకోవడం ప్రతికూలాంశంగా మారడం.. ఎలాగైన తిరిగి వారిని తమ గూటికి తీసుకురావలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. పేరుకు అధికార పక్షంలో ఉన్నా సరైన గుర్తింపు లేక రోజుల వెళ్లదీస్తున్న అప్పటి కాంగ్రెస్ ఇప్పటి టీ.ఆర్.ఎస్ నేతలు గుబులుగా ఉన్నారట.. అది చూసుకుని ఎన్నికల సమయానికి తిరిగి పార్టీకి వస్తారనే ఉత్తం నమ్మకంతో ఉన్నారట. ఇప్పటికే చాలా మంది నాయకులు సైతం అనసవరంగా పార్టీ మారాం అనే అభిప్రాయం కూడా ఆయన ముందు వ్యక్తం చేయడం కూడా కాంగ్రెస్ మానసికంగా దృఢంగా మారిందట.. అందుకే అధికారం కోల్పోయిన తరవాత సొంత పార్టీలో ఎంత కుమ్ములాటలున్నా మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*