నటి భానుప్రియకు టాటా జీవిత సాఫల్య పురస్కారంWant create site? Find Free WordPress Themes and plugins.

తెలంగాణా అమెరికన్ తెలుగు సంఘం(టాటా) ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను డల్లాస్ సమీప ఫ్రిస్కోలోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో శుక్ర, శనివారాల్లో వైభవంగా నిర్వహించారు. 6వేలకు పైగా అతిథులు ఈ వేడుకలకు హాజరయ్యారు. సంస్థ కార్యదర్శి జంగం విక్రం, కోశాధికారి ఆదిభట్ల మహేష్‌లు స్వాగతోపన్యాసం చేస్తూ డల్లాస్‌లో టాటా కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. సినీనటులు నిఖిల్, స్వాతి, దేవరకొండ విజయ్, మధుశాలిని, యాంకర్ రవి, ఎంసీ మధు తదితరుల ప్రదర్శనలు, స్థానిక ప్రవాస యువతీయువకుల నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థం, సౌత్‌లేక్ నగర మేయర్ తదితరులు తమ శుభాకాంక్షలు తెలిపారు. టాటా సలహా సంఘ అధ్యక్షుడు డా.పైళ్ల మల్లారెడ్డి, టాటా అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, నాటా వ్యవ్యాస్థాపకులు డా.ప్రేంరెడ్డిలు సినీనటి భానుప్రియకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందించారు. అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ప్రసంగిస్తూ సేవా కార్యక్రమాల్లో ప్రవాసులు విరివిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. టాటా ముచ్చట పేరిట గూడూరి శ్రీనివాస్ నేతృత్వంలో రూపొందించిన టాటా మాసపత్రికను ఆవిష్కరించారు. ఆటా, నాటా, టీప్యాడ్, టాంటెక్స్ తదితర సంస్థల ప్రతినిధులు టాటాకు తమ అభినందనలు తెలిపారు. జానపద సోదరులు మానప్రగడ శ్రీనివాస్, మానప్రగడ సాయి, సినీగాయకులు హేమచంద్ర, శ్రవణభార్గవి, మిమిక్రీ రమేష్ తదితరులు తమ ప్రతిభతో ప్రవాసులను ఆకట్టుకున్నారు. ఫిలడెల్ఫియాలో 2018లో నిర్వహించనున్న ద్వైవార్షిక సభలను ఆటా-నాటా-టాటాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తాయని ఆటా వ్యవస్థాపకుడు హనుమంతరెడ్డి, నాటా వ్యవస్థాపకుడు డా.ప్రేంరెడ్డి, టాటా వ్యవస్థాపకుడు డా.పైళ్ల మల్లారెడ్డిలు చేసిన ప్రకటనకు ప్రవాసులు తమ హార్షాతిరేకాలు తెలిపారు. ఈ వేడుకల్లో టాటా సంస్థ ప్రతినిధులు డా.హరినాథ్ పొలిచెర్ల, పట్లోల్ల మోహన్, విజయపాల్ రెడ్డి, అనుగు శ్రీనివాస్, మదాడి భరత్, తాడేపల్లి ఫణిభుషణ్, అనీల్ ఎర్రబెల్లి, గోలి గౌతం, సంజీవ్ రెడ్డి, మహేందర్ కామిరెడ్డి, జగదీష్ బొందుగుల, మాధవ ఉప్పుగల్ల, మల్లాది రాంరెడ్డి, జ్యోతి రెడ్డి, శేరి విజయ్, కోలన్ మధు, నాగులగారి రవీందర్, ఆవుల శ్రీనివాస్, వంశీ రెడ్డి, వేముగంటి శరత్, మెతుకు నరేందర్, మలిపెద్ది నవీన్, తంగెళ్లపల్లి రమేష్, నాటా నుండి గంగసాని రాజేశ్వరరెడ్డి, గోశాల రాఘవరెడ్డి, కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, ఆటా నుండి గవ్వా సంధ్యా, భీంరెడ్డి పరమేష్, కొండపల్లి సౌమ్య, అజయ్ రెడ్డి, ముప్పిడి అరవింద్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*