వైఎస్ కాలంలో మిర్చి క్వింటా రూ.15వేలు ఉందట



Want create site? Find Free WordPress Themes and plugins.
చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటే ఇదేనేమో. ఏది చెప్పినా ప్రజలు వెర్రి వెంగలప్పల్లా వింటారనుకుంటున్నారు మాజీ మంత్రి పార్థసారధి. అందుకే మిర్చి ధర పై తనకు తెలిసిన సంగతి చెప్పారు. దివంగత సి.ఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనా కాలంలో మిర్చి ధర క్వింటాలు రూ.15,000 ఉండేదని చెప్పారాయన. దీంతోవిస్తుపోవడం వైసీపీ నేతల వంతైంది. వైఎస్ పాలనను గొప్పగా చెప్పేందుకు ఆయన మిర్చి ధరను అమాంతం పెంచి చెప్పారు. క్వింటా మిర్చి ధర రూ.15 వేలు ఎప్పుడూ లేదని చెబుతున్నారు రైతులు. ఇప్పుడు మిర్చి ధరలు తగ్గాయని, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని చెప్పాలే గానీ..తమ కాలంలో అంత ఉందని..ఇంత ఉందని చెప్పడం సిగ్గుచేటంటున్నారు అన్నదాతలు. 
                   గుంటూరులో జగన్ చేస్తున్న మిర్చి దీక్షలో పాల్గొన్నారు మాజీ మంత్రి. ఈ సందర్భంగా నోటికొటికొచ్చినట్లు మాట్లాడాన్ని తప్పుపట్టారు మరోవైపు మిర్చి వ్యాపారులు. మిర్చి రైతుకు క్వింటాకు అదనంగా తాము రూ.1500 మద్దతు ధర ఇస్తున్నారని…పక్క రాష్ట్రంలో కనీసం ఆ పని చేయలేకపోయారని గుర్తు చేస్తున్నారు ఇంకోవైపు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ నేత వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. 
                    దీంతో సోమిరెడ్డి పై నిప్పులు చెరిగారు వైసీపీ నేతలు. ఎపిలో ఒక మంత్రి ఉన్నాడు. ఆయన పేరు సోమిరెడ్డి.కానీ ఆయన సోది చెబుతుంటారని మాజీ మంత్రి కె.పార్ధసారది మండిపడ్డారు. మార్చి నెలలో మిర్చి రైతులను జగన్ పరామర్శించారు. గుంటూరు యార్డులో జగన్ పర్యటించిన తర్వాత క్వింటాలుకు రూ.1500 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*