టీడీపీని వీడనంటున్న ఆనం బ్ర‌ద‌ర్స్‌



Want create site? Find Free WordPress Themes and plugins.
నెల్లూరులో ఆనం బ్ర‌ద‌ర్స్ మంచి ఫాలోయింగ్ ఉంది. టీడీపీలో ఉన్న వీరిద్ద‌రికి పార్టీ అధిష్టానంతో మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డంతో రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. దీంతో ఆనం బ్ర‌ద‌ర్స్ వైసీపీలో చేరుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. వీరిని చేర్చుకునేందుకు జ‌గ‌న్ కూడా మొగ్గు చూపించాడు. కాని తాము టీడీపీ వీడేది లేద‌ని ఆనం వివేకా స్ప‌ష్టం చేశాడు. టీడీపీలోనే కొన‌సాగుతూ నెల్లూరులో త‌మ‌కు కేటాయించే సీట్ల‌లో గెలుస్తామ‌ని ప్ర‌క‌టించాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమ‌ని కొట్టిపారేశారు. పార్టీ మారేది లేద‌ని సీఎంకు సైతం చెప్పేశార‌ట‌. మాకు చంద్రబాబు ఎప్పుడు అన్యాయం చేయర‌ని అన్నారు. జగన్ దీక్ష చేయడం హాస్యాస్పదం. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు రైతు కళ్ళల్లో మిర్చిపొడి చల్లి లక్ష కోట్లు దోచుకున్నాడు. ఇప్పుడు కూడా అందుకే జగన్ దీక్ష చేస్తున్నాడు. జగన్ దీక్ష పేరుతో కొంగ జపం చేస్తున్నాడు. జగన్ మిరప రైతులపై దొంగ ప్రేమ చూపిస్తున్నాడు. ఆయనకి వ్యవసాయం అంటే అసలు తెలియదు అంటూ విమ‌ర్శ‌లు చేశాడు. ఆనం వివేకానంద వ్యాఖ్య‌ల‌తో వైసీపీ నేత‌లు ఖంగుతిన్నార‌ట‌. త‌మ‌తో ప‌నిచేసేందుకు వ‌స్తార‌నుకున్న నాయ‌కులు ఎదురు తిర‌గ‌డం వారికి మింగుడు ప‌డ‌టం లేద‌ట‌. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*