నంద్యాల సీటు కోసం పట్టు



Want create site? Find Free WordPress Themes and plugins.
నంద్యాలలో తమ కుటుంబానికి సీటు ఇవ్వాలని కోరారు మంత్రి అఖిల ప్రియ. ఈ మేరకు సి.ఎం చంద్రబాబునాయుడును కలిసి తమ వాదన వినిపించారు. తండ్రి భూమా నాగిరెడ్డి చనిపోయిన స్థానం కాబట్టి తమకే కేటాయించాలని కోరారామె. అయినా పట్టువీడలేదు మరోవైపు శిల్పా వర్గం. చంద్రబాబుతో ఆ వర్గం భేటీ అయింది. దీంతో టీడీపీ టిక్కెట్ ఎవరికి ఇవ్వాలన్నదానిపై అదిష్టానం తేల్చుకోలేకపోతోంది. రెండు వర్గాలు పోటీ పడటంతో ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారింది. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని పైకి చెబుతున్నా వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉంది.
  దీంతో తన అమెరికా పర్యటనకు ముందే నంద్యాల సీటు పై ప్రకటన చేసేందుకు బాబు సిద్దమయ్యారంటున్నారు. శిల్పా సోదరులు మరోసారి చంద్రబాబును కలిసేందుకు సిద్ధమవడం ఇప్పుడు హాట్ టాపికైంది. గత ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయామని మూడేళ్లుగా చాలా కష్టపడ్డామని, తమకే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు వాళ్లు. పార్టీని నిలబెట్టిన వారికా.. లేక పార్టీలో చేరి చనిపోయిన వారి కుటుంబీకులకా అన్నది తేల్చుకోలేకపోతున్నారు చంద్రబాబు. నంద్యాల సీటు పై అటు కేఈ, ఇటు మాజీ మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్, భూమా వర్గీయుడైన ఏవీ సుబ్బారెడ్డి, ఎంపీ ఎస్పీవైరెడ్డి వర్గీయులతోను చంద్రబాబు మాట్లాడారు. చివరికి ఏమి చేస్తారన్నది ఉత్కంఠను పెంచుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*