వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ మంత్రి



Want create site? Find Free WordPress Themes and plugins.
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పసుపులేటి బాలరాజు పార్టీ మారనున్నారు. వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధికి చెందిన బాలరాజు తొలిగా కండక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత టీచర్ గాను సేవలందిస్తూనే కాఫీ బోర్డు అధ్యక్షుడిగాను ఎంపికయ్యారు. క్రమంగా రాజకీయాల వైపు దృష్టి సారించిన బాలరాజు చింతపల్లి నియోజక వర్గం నుంచి 1989లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో పాడేరు నుంచి చట్టసభకు ఎన్నికై వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో కేబినెట్ సభ్యుడిగా కొనసాగారు.
  గిరిజనశాఖ మంత్రిగా పని చేసిన బాలరాజు అరకులో ఎమ్మెల్యేలందరితో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయించారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. ఏపీలో ఒక్క సీటు రాలేదు హస్తం పార్టీకి. అప్పటి నుంచి రాజకీయాలను పెద్దగా పట్టించుకోని బాలరాజు ఇప్పుడు తిరిగి క్రియాశీలకం అయ్యేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే జగన్ పార్టీలో చేరేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని.. ఎప్పుడు చేరిది తేదీ ప్రకటించడమే మిగిలిందంటున్నారు మరోవైపు ఆయన అనుచరులు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*