మిర్చి రైతును ఆదుకుంటున్న చంద్రన్న



Want create site? Find Free WordPress Themes and plugins.
ఏపీ సి.ఎం చంద్రబాబునాయుడు రైతును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మిర్చి కొనుగోలుకు చంద్రన్న రాయితీ పేరుతో అదనంగా డబ్బులు చెల్లిస్తున్నారు. ఒక్కో క్వింటాకు రూ.1500 అదనం ధరను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏప్రిల్ 21నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల టిక్కీల మిర్చిని ఇలా కొనుగోలు చేశారు. ఒక్కో రైతు దాదాపు 20 క్వింటాళ్ల వరకు అమ్ముకుని,అదనపు ధరను పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నెల రోజుల కిందట వరకు క్వింటా 8వేల వరకు ఉండేది. అది ఒక్కసారిగా రూ.4నుంచి 5వేలకు పడిపోయింది. ఏపీతో పాటు…తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి ఇబ్బడిముబ్బడిగా మిర్చిని గుంటూరు మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. ఫలితంగా గుంటూరు – హైదరాబాద్‌, ఒంగోలు ప్రధాన రహదారులు మిర్చి బస్తాలతో నిండిపోయాయి. కాలు కదపలేని పరిస్ధితి ఏర్పడింది. సీఎం చంద్రబాబు పథకం కింద క్వింటా ఒక్కింటికీ రూ.1500 అదనంగా చెల్లిస్తుండడంతో ఆ లబ్ధి పొందేందుకు ఇతర ప్రాంతాల రైతులు కూడా పోటీ పడుతున్నారు. దీంతో ముందు ఏపీ రైతులకే ఈ పథకం వల్ల లబ్ది చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. వారం పది రోజుల్లో మిర్చి రైతుల ఇబ్బందులు తీర్చాలని అవసరమైతే అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ కొనుగోళ్లు చేయాలని సి.ఎం చంద్రబాబు ఆదేశించారు. ఇది తమకు ఊరటనిస్తుందని చెబుతున్నారు మరోవైపు అన్నదాతలు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*