ప్ర‌తిప‌క్షాల సీఎం అభ్య‌ర్ధులు ఎవ‌ర‌బ్బా!Want create site? Find Free WordPress Themes and plugins.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు.. పార్టీల‌న్నీ సన్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. దేశ ప్ర‌ధాని మోడీ నోటి నుంచి రావ‌టంతోనే ఏడాది ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌వ‌చ్చ‌నే ఊహాగానాలు మ‌రింత పెరిగాయి. తెలుగు సీఎంలిద్ద‌రూ.. త‌మ పార్టీ శ్రేణుల‌కు ఎన్నిక‌ల స‌మరానికి సిద్ధం క‌మ్మంటూ ప్ర‌క‌టించారు. అస్త్రశ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకునే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. అధికారంలో ఉండ‌టంతో.. ఏది చేసినా.. చెల్లుబాట‌వుతుంది. ఆర్ధికంగా, రాజ‌కీయంగానూ ఆ పార్టీల‌కు అవ‌కాశం ఉంది. మ‌రి.. విప‌క్ష పార్టీల సంగ‌తి ఏమిటీ.. టీడీపీ, టీఆర్ ఎస్ పార్టీల్లో ఒకే ఒక్క నాయ‌కుడు.. చంద్ర‌బాబునాయుడు, చంద్ర‌శేఖ‌ర్‌రావు. మ‌రి కాంగ్రెస్‌లో ప‌రిస్థితి వేరు. ఢిల్లీ నుంచి హైక‌మాండ్ ఆదేశిస్తే.. చాలు. అప్ప‌టి వ‌ర‌కూ బేర‌ర్‌గా వున్న వ్య‌క్తి సైతం నాయ‌కుడు కాగ‌ల‌డు. ఏదో మూల‌న గ్రామంలో వున్న స‌ర్పంచ్‌ను ఎమ్మెల్యే అభ్య‌ర్థిగానూ ప్ర‌కటించ‌గ‌ల‌రు. ఎవ‌రెంత‌.. అదిష్ఠానాన్ని సంతృప్తి ప‌ర‌చ‌గ‌లిగితే.. అంత చేరువైన‌ట్లు లెక్క‌. గ‌త అనుభ‌వాలు చూస్తే.. ఇది నిజ‌మ‌నే భావ‌న క‌ల‌గ‌క‌మాన‌దు. 2018, 2019 ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా మేం రెడీ అంటూ.. టీఆర్ ఎస్‌, టీడీపీలు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నాయి. గెలుపు మాదేనంటూ.. ధీమా వ్య‌క్తంచేస్తున్నాయి. ఏపీలో టీడీపీ ప‌రిస్థితికి భిన్నంగా తెలంగాణ‌లో నెల‌కొంది.  

        స‌మ‌ర్థుడైన నాయ‌కుడు క‌ర‌వ‌య్యాడ‌నే చెప్పాలి. ఎవ‌ర్ని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించినా మిగిలిన‌ వ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌నే అభిప్రాయం ఉంది. రావుల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ర‌మ‌ణ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ‌లో కాంగ్రెస్ గ్రూపులు పార్టీకు త‌ల‌నొప్పిగా మారాయి. ఎవ‌ర్ని సీఎం అభ్య‌ర్థిగా ముంద‌స్తు ప్ర‌క‌ట‌న చేసినా.. గెలిచే సీట్లు చేజార‌వ‌చ్చ‌నే ఆందోళ‌న ఆ పార్టీది. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి వ‌ర్గాలు.. త‌మ నేత‌లు సీఎం అభ్య‌ర్థులంటూ ప్ర‌చారం సైతం ప్రారంభించాయి. హ‌స్తం పార్టీలో ద‌శాబ్దాల త‌ర‌బ‌డి వున్న సీనియ‌ర్లు జ‌య‌పాల్‌రెడ్డి, జానారెడ్డి, పొన్న‌ల ల‌క్ష్మ‌య్య , డీకే అరుణ‌, గీతారెడ్డి, దామోద‌రం రాజ‌న‌ర్సింహ వంటి వారు.. రేసులో ఉన్నారు. ఏపీలో ర‌ఘువీరారెడ్డి మాత్ర‌మే… ఒంటిచేత్తో పార్టీను లాక్కు వ‌స్తున్నారు. కాంగ్రెస్ ఆశాదీపం మెగాస్టార్ చిరంజీవి కూడా త‌న సినిమా హ‌డావుడిలో వున్నారు. ఓటర్ల‌ను ఆక‌ట్టుకునేంత గ్లామ‌ర్‌.. జ‌నామోదం వున్న నాయ‌కుడు ఎవ‌ర‌న్న‌దే ఇప్పుడు తెలుగు నేల‌పై ఉన్న ప్రాంతీయ‌పార్టీలు, జాతీయ పార్టీల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న. బీజేపీ సంగ‌తి దాదాపు అదే అని చెప్పాల్సిందే. తొలిసారి అధికారం కోసం శ్ర‌మించేందుకు సిద్ధ‌మైన కాషాయం.. త‌మ సీఎం అభ్య‌ర్థులుగా ఎవ‌ర్ని ప్ర‌క‌టిస్తుంద‌నేది నిజంగా ఉత్కంఠే.

Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*