ఏపీలో కియా కార్ల ప‌రిశ్ర‌మ‌



Want create site? Find Free WordPress Themes and plugins.
 రాష్ట్రానికి మరో అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం రంగప్రవేశం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రసిద్ధ కార్ల కంపెనీ కియా సిద్ధమైంది. రూ.12 వేల కోట్ల పెట్టుబడితో చిన్న కార్ల తయారీ కేంద్రాన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనుంది. దీనిపై గురువారం ఉదయం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సంస్థ ప్రతినిధులు అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఏటా 3 లక్షల కార్ల తయారీ లక్ష్యంతో ఏర్పాటు కానున్న ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా పదివేల మందికి, పరోక్షంగా మరెంతో మందికి ఉపాధి లభించనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో పరిశ్రమకు అవసరమైన మానవ వనరులకు శిక్షణ ఇవ్వనున్నారు.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారీ రంగానికి గమ్యస్థానంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి ఇది మరో ముందడుగుగా చెప్పాలి. దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ద కార్ల తయారీ పరిశ్రమ కియా రాయలసీమలోని అనంతపురం జిల్లాలో  ఏర్పాటు చేయనున్నారు. కియాకు దక్షిణ కొరియా, మెక్సికో, జర్మనీ దేశాలలో ప్లాంట్లు వున్నాయి. భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న చిన్న కార్ల మార్కెట్‌ను చేజిక్కించుకోవడానికి ఇక్కడ ప్లాంటును నెలకొల్పాలని కియా సంస్థ ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ఆ సంస్థ గుజరాత్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలను పరిశీలించింది. ఆయా రాష్ట్రాలనుంచి ఏపీకి చివరి వరకు గట్టి పోటీ ఎదురైనప్పటికీ అంతిమంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టాలని కియా నిర్ణయానికి వచ్చింది. పరిశ్రమ స్థాపనకు మిగిలిన రాష్ట్రాలకంటే ఎక్కువ ప్రోత్సాహకాలు అందించడం, ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్‌వన్‌గా ఉండటం, దార్శనికత గల నేత రాష్ట్రానికి నాయకత్వం వహించడం లాంటివి ఏపీకి అనుకూల అంశాలుగా మారాయి.  పెనుకొండలో ఏటా 3 లక్షల కార్ల తయారీ సామర్థ్యంతో ప్లాంటు నిర్మించి, 2019 ద్వితీయార్దానికల్లా ఉత్పత్తి ప్రారంభించాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో పరిశ్రమ నిర్మాణం చేపట్టనుంది. తొలిదశలో రూ.6వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*