పోటీ సభలతో గులాబీకి ముల్లు గుచ్చుతామంటున్న టీడీపీ



Want create site? Find Free WordPress Themes and plugins.
తమ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి టీఆర్ఎస్ ప్రచార భేరి నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సభలు, సమావేశాలు జరుపుతోంది. ఓరుగల్లులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. గులాబీ నేతలు ఎక్కడైతే బహిరంగ సభ నిర్వహించారో అదే పట్టణంలో తాము పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేసేలా తెలంగాణ టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే తాండారులో బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేయనుంది. తాండూరు సభ సక్సెస్ అయితే ఆ తర్వాత సిద్ధిపేట, పాలేరు, సిరిసిల్లలోను భారీసభలు ఏర్పాటు చేయనుంది.
       వైజాగ్ లో జరిగే మహానాడుకు ముందే సభ నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు వారు హామినిచ్చినట్లు తెలుస్తోంది. గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నారు. రైతు ప్రభుత్వం మాదని చెబుతున్న కేసీఆర్ సర్కారును ఇరుకున పెట్టే వ్యూహంతో వెళ్లనుంది టీడీపీ. ప్రజలు ఈ అంశాలను నమ్ముతారో లేదో మరి. ప్ర‌జా పోరు పేరిట నిర్వ‌హించే స‌భ‌ల్లో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల్ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెబుతామ‌ంటున్నారు రేవంత్ రెడ్డి లాంటి నేతలు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*