ఎన్టీఆర్ విషయంలో తప్పుచేశానన్న దగ్గుబాటి 



Want create site? Find Free WordPress Themes and plugins.
ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడ్ని చేయడం ముమ్మాటికీ తప్పే. ఉన్నతమైన వ్యక్తి ఆయన. జాతికి ప్రతీక అని గతాన్ని గుర్తు చేసుకున్నారు సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మనసులో మాటను బయట పెట్టారు దగ్గుబాటి. ఎన్టీఆర్ తప్పు చేసినప్పటికీ తాను అలా వ్యవహరించాల్సి ఉండాల్సింది కాదన్నారు దగ్గుబాటి. ఎన్టీఆర్ విషయంలో తప్పు చేయడం నా జీవితంలో అసహ్యకరమైన సంఘటనగా భావిస్తున్నాను. అది సరైనది కాదని ప్రస్తావించారు ఎన్టీఆర్ అల్లుడు. 1989లో హైదరాబాద్ లో మహానాడు నిర్వహించగా మిగిలిన డబ్బులు రూ.35లక్షలు రామారావుగారికి  ఇచ్చాను.
              అప్పుడు మహానాడుకు అయిన ఖర్చు కేవలం రూ.15 లక్షలు అని గుర్తు చేసుకున్నారు దగ్గుబాటి. లక్ష్మీపార్వతి పార్టీ పరువు తీసిందని చెప్పిన చంద్రబాబునాయుడు.. ఆ తర్వాత నల్గొండలో జరిగిన సభలో ఆమెకు మంచినీళ్లు అందించారని ప్రస్తావించారు దగ్గుబాటి. ఆసంగతులు అప్పటి ఆంధ్రజ్యోతి పత్రిక ఫ్రంట్ పేజిలో వచ్చిందని చెప్పారు ఎన్టీఆర్ అల్లుడు. ఎన్టీఆర్ ను పార్టీ పెట్టాలని చంద్రబాబు చెప్పిన మాట నిజం కాదన్నారు దగ్గుబాటి. అప్పుడు అసలు బాబు కాంగ్రెస్ లో ఉన్నారని గుర్తు చేశారు. టీడీపీ ఏర్పాటు చేశాక చానాళ్లకు చంద్రబాబు వచ్చిన సంగతి గుర్తు చేశారు దగ్గుబాటి. అసలు చంద్రబాబును పార్టీలోకి రావాలని కోరిందే తాను అని చెప్పారు దగ్గుబాటి. దీంతో చంద్రబాబు చెప్పింది నిజామా కాదా అనే సందేహాలు ముసురుకున్నాయి.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*