బాబా రాం దేవ్ కు ఏం జరగలేదు…



Want create site? Find Free WordPress Themes and plugins.
రెండురోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. దాదాపు అన్ని గ్రూపుల్లోనూ అదే వార్త దర్శనమిస్తుంది. బాబా రాందేవ్ ప్రమాదానికి గురయ్యారనేది ఆ వార్త సారాంశం. వాస్తవంగా ఆయనకు ఏం కాలేదు. ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొందరు వ్యక్తులు అత్యుత్సాహాంతో చేసిన పని అందరినీ ఆందోళనకు గురి చేసింది. ఆ వార్త ఎవరు పెట్టారు. ఎక్కడ నుంచి వచ్చిందనే వైనంపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. రాందేవ్ బాబాకు ఏం జరగకపోతే ఆ ఫోటోలు ఎక్కడ నుంచి వచ్చాయనే ప్రశ్న తలెత్తింది. వాస్తవంగా ఆ ఫోటోలు 2011 సంవత్సరంలోవి. అప్పట్లో బాబా రాందేవ్ ప్రయాణిస్తున్న కారు పుణే హైవేపై ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రాందేవ్ గాయపడ్డారు.
              అప్పుడు తీసిన ఫొటోలతో రాందేవ్ తాజాగా ప్రమాదానికి గురైనట్లు వార్తలు సృష్టించి వాట్సాప్‌లో పెట్టారు. అది కాస్త అందరికీ చేరిపోయింది. ఇంకా చేరుతోంది. బాబా ముంబై నుంచి పుణే వెళ్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైందని, బాబా కన్నుమూశారని ఈ వాట్సాప్ మెసేజ్‌లో ఉంది. అయితే ఈ రూమర్‌ను పుణే హైవే కంట్రోల్ అధికారులు ఖండించారు. ముంబై – పుణే హైవే అలాంటి ప్రమాదమేమీ జరగలేదని, ఇదంతా రూమరని కొట్టిపారేశారు. పతాంజలి అమ్మకాలను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఇలాంటి వార్తలను పోస్టు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. వాస్తవం బయట పడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*