వైసీపీ ఉత్త‌రాది వ్యూహాల‌ను అమ‌లు చేస్తుంద‌ట‌Want create site? Find Free WordPress Themes and plugins.
ముంద‌స్తు ఎన్నిక‌లంటూ కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు సంకేతాలు పంపుతున్నాయి. మ‌రో యేడాదిలో జ‌రిగే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచి స‌న్న‌ద్దం కావాలనుకుంటున్నార‌ట వైసీపీ నేత‌లు. జ‌గ‌న్ వ్యూహాల‌కు తోడు ఉత్త‌దాదికి చెందిన ఓ వ్యూహ‌క‌ర్త‌ను కూడా రంగంలోకి దించారు. ఈ సారి జ‌రగ‌బోయే ఎన్నిక‌ల‌కు పార్టీకి చావోరేవో కావ‌డంతో అన్ని అవ‌కాశాల‌ను జ‌గ‌న్ ఉప‌యోగించుకునే ప‌నిలో ప‌డ్డారు.. గ‌త ఎన్నికల్లో జ‌రిగిన పొర‌పాటుల‌ను ఈ ఎన్నిక‌ల్లో జ‌ర‌గ‌కుండా జ‌గ‌న్ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టారు.. ఉత్త‌ర భారత‌దేశంలో ఎన్నికల వ్యూహ‌క‌ర్త‌గా పేరుగాంచిన ప్ర‌శాంత్ కిషోర్‌ను ఏపీలో వైసీపీ ఎన్నిక‌లు వ్య‌వ‌హారాలు చూసేందుకు ఇంచార్జిగా నియ‌మించుకున్నాడు. ఢిల్లి, బీహార్ ఎన్నిక‌ల్లో ప్ర‌శాంత్ వ్యూహాలు బాగా ప‌నిచేశాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం ఆయ‌న‌పాచిక‌లు పార‌లేద‌ట‌. అయితే ప్ర‌శాంత్ కిషోర్ నియామ‌కంపై పార్టీలో భిన్న‌ాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. నార్త్ లో ఉన్న ప‌రిస్థితులు ఏపీలో ఉండవనేది పార్టీ నేతలు చెబుతున్నారు.. ఇక్కడ ప్ర‌జ‌ల నాడిని అంచ‌నా వేయ‌డం అంత తేలికైన విష‌యం కాదంటున్నారు పార్టీలోని సీనియ‌ర్లు.. న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం ఉన్న త‌మ‌ అనుభవాన్ని పక్కన పెట్టి ఢిల్లీ వాసి ఏపీలో పరిస్థితులు ఎలా అంచనా వేస్తారని ప్రశ్నిస్తున్నారు…. ఒక్క బీహార్ ఎన్నిక‌ల్లో త‌ప్ప ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాలు ఇత‌ర రాష్ట్రాల్లో ఫలించలేదు కాబట్టి ఆయన మీద పూర్తి నమ్మకం పెట్టుకుంటే నష్టపోయే ప్రమాదం ఉందని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు… ఉత్త‌రప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహంతో అఖిలేష్ బొక్కబోర్ల పడ్డ విషయంపై పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఏపీ రాజ‌కీయాల్లో కులం, డ‌బ్బుతో పాటు స్థానిక అంశాలు ఆధారంగా ఎన్నికలు జరుగుతాయని పార్టీ నేతలు అంటున్నారు.. ఎన్నికల్లో మేనిఫెస్టో కీ రోల్ పోషిస్తుందని దానిపై కసరత్తు చేస్తే బాగుంటుందని పార్టీలో చర్చ జరుగుతుంది.. ప్ర‌శాంత్ కిషోర్ ఎక్కువగా సోష‌ల్ మీడియాను కేంద్రంగా ఎన్నికల వ్యూహాలు ఉంటాయి కాబట్టి అది ఏపీలో అంతగా వర్కౌట్ కాదని సీనియర్లు అంటున్నారు… ఇటీవ‌ల సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారాలు అన్ని ప్రశాంత్ ఇచ్చిన సలహాల్లో భాగమే అని పార్టీ నేతలు అంటున్నారు.. వైసీపీ సోషల్ మీడియా కార్యక్రమంలో నోటీసు ఇవ్వ‌డానికి వ‌చ్చిన పోలీస‌లుపై విజయసాయిరెడ్డి వాగ్వివాధానికి దిగడం కూడా పీకే ఇచ్చిన సలహాగా పార్టీ నేతలు అంటున్నారు… ఇలా దూకుడుగా వ్యవహరిస్తే యూత్ లో మంచి ఫాలోయింగ్ వ‌స్తుదనేది పార్టీ నేతల అంచనా..మ‌రి జ‌గ‌న్ ఈ విష‌యాన్ని ప‌సిగ‌డ‌తాడో లేదో…..
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*