రెండు సీట్లు అడుగుతున్న మాజీ మంత్రి కన్నా



Want create site? Find Free WordPress Themes and plugins.
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వైసీపీ నేతలతో కన్నా అనుచరులు ఇప్పటికే చర్చలు జరిపారు. కానీ ఇంకా అవి ఒక కొలిక్కి రాలేదట. తనకు పెదకూరపాడు, గుంటూరు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని కన్నా అడుగుతున్నారట. ఒక సీట్లో తాను.. మరో సీటు నుంచి తన కుమారుడు పోటీ చేస్తారని ఆయన చెప్పారని సమాచారం. ఇందుకు జగన్ సుముఖంగా లేరంటున్నారు. పెదకూరపాడు నియోజవర్గం నుంచి గతంలో మూడుసార్లు గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ మరోసారి అక్కడ నుంచే పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు కంటే అదే తనకు మంచిదని భావిస్తున్నారట. టీడీపీతో బీజేపీకి పొత్తు ఉంది. రానున్న ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే పెదకూరపాడు సీటు ఇస్తారో లేదోనన్న సందేహం నెలకుంది. టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
    ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది. అలాంటి వ్యక్తిని కాదని సి.ఎం చంద్రబాబు మిత్రపక్షానికి ఆ సీటు ఇవ్వరనే వాదనుంది. అందుకే ముందస్తుగా బీజేపీని వీడి వైసీపీిలోకి జంప్ చేసేందుకు కన్నా పక్కా ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అచ్చెంపేట, క్రోసూరు, రాజుపాలెం, బెల్లంకొండ, పెదకూరపాడు మండల నేతలతోను కన్నా మంతనాలు జరుపుతున్నారు. తాను తిరిగి పెదకూరపాడులో పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందని అడిగినట్లు తెలుస్తోంది. మరోవైపు కన్నా లాంటి వ్యక్తులను వదులుకునేందుకు జగన్ సిద్ధంగా లేరంటున్నారు. అంబటి రాంబాబుతో పాటు.. ఉమ్మారెడ్డి, వెంకటేశ్వర్లు వంటినేతలు ప్రస్తుతం కన్నా వర్గీయులతో మాట మంతి జరుపుతున్నారట. అంతా ఓ కే అయితే రెండు నెలల్లోపే జగన్ పార్టీలో కన్నా చేరతారనే ప్రచారం జరుగుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*