వైసీపీలో నైరాశ్యం ఎందుకంటే!Want create site? Find Free WordPress Themes and plugins.

మూడు నాలుగేళ్ల క్రితం దూకుడు మీదున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్ర‌స్తుతం స్త‌బ్ధ‌త నెల‌కొంది. అధినేత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌పై మారుతున్న స‌మీక‌ర‌ణ‌లు గ‌ట్టెక్కిస్తాయా! ఏటిలో నెట్టేస్తాయా అనే మీమాంశ నెల‌కొంది. వైసీపీ నుంచి గెలుపొందిన 67 మంది ఎమ్మెల్యేల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ 21 మంది టీడీపీ గూటిలోకి చేరారు. మిగిలిన చోట్ల ఎమ్మెల్యేల ప‌నితీరుపై ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు ఎదురవుతున్నాయి. ప్ర‌తిప‌క్ష పార్టీ నేతలు కాబ‌ట్టి.. నిధులు మంజూరు చేయ‌లేద‌ని చెప్పినా న‌మ్మే ప‌రిస్థితిలో లేరు. ప్ర‌జాప‌క్షం నిల‌బ‌డిన‌ ప్ర‌తిప‌క్షంగా వైసీపీ చెప్పుకోద‌గిన ఉద్య‌మాలు చేసిన దాఖ‌లాల్లేవు. అధికార పార్టీ వేసిన ఎమోష‌న్ ఉచ్చులో తేలిగ్గా చిక్కుకున్నారు. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ సీఎం చంద్ర‌బాబునాయుడును విమ‌ర్శించ‌టం మిన‌హా వారు సాధించిందేమీ లేద‌న్న అప‌వాదు మూట‌గ‌ట్టుకున్నారు. పార్టీకు వెన్నుద‌న్నుగా నిల‌చిన క‌డ‌ప‌, క‌ర్నూలు, గోదావ‌రిజిల్లాల్లోని ప‌లువురు సైకిల్ ఎక్క‌డం ప‌రోక్షంగా జ‌గ‌న్‌కు పెద్ద ఇబ్బందే అని చెప్పాలి. మాట మీద నిల‌బ‌డ‌లేని నాయ‌క‌త్వంలో.. గెలిచిన ఎమ్మెల్యేలు రేపు.. ఇదే పార్టీలో ఉంటారా! అనే అనుమానాలుంటాయి. ఇప్ప‌టికే జ‌గ‌న్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది సీబీఐ. 

       అవినీతి ప్ర‌ధానాంశం గాక‌పోయినా జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత అక్ర‌మాస్తుల కేసులో జైలుకు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఎదురైతే.. పాల‌నా ప‌ర‌మైన అగ‌చాట్లు చ‌విచూడాల్సి వ‌స్తుంద‌నే భావ‌న కూడా ఇప్పుడిప్పుడే నెల‌కొంటుంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ పొత్తుకోసం చేయిచాచిన‌పుడు. వైసీపీ నుంచి వచ్చిన స్పంద‌న‌పై కాషాయ‌నేత‌లు ఇప్ప‌టికీ గుర్రుగానే ఉన్నాయి. ఇప్ప‌టికీ దానికి బ‌దులివ్వాల‌నే ప్ర‌య‌త్నాల్లో వున్నారు. అన్నింటినీ మించి.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నిచేస్తున్న స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌కు సీట్లు ఇస్తారా! లేదా అనుమానం నెల‌కొంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి చ‌విచూసిన నేత‌లు.. మ‌రోసారి ఎన్నిక‌లు ఎదుర్కొనేంత ఆర్ధిక స్థోమ‌త వున్న వారు చాలా త‌క్కువ మందే ఉన్నారు. అధికార పార్టీ అభ్య‌ర్థుల‌కు ధీటుగా స‌మాధానం ఇవ్వ‌గ‌ల‌రా! అనేది కూడా ఇప్పుడు ఎదుర‌వుతున్న మ‌రో సందేహం. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో రాబోయే ఎన్నిక‌ల్లో సీటు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. గ‌తంలో భంగ‌ప‌డిన వారు.. జ‌గ‌న్ హామీతో వెన‌క్కి త‌గ్గిన‌వారు.. ఈ సారి మాట వినే ప‌రిస్థితిలో లేరంటూ సొంత‌పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఎన్నికల‌కు ముందు అభ్య‌ర్థుల‌పై స‌ర్వే చేయించి.. పార్టీ టిక్కెట్ ఇస్తుందా! అనే అనుమానాలూ ఉన్నాయి. అంత‌ర్గ‌తంగా నాయ‌క‌త్వ లేమి ఇప్ప‌టికే స‌వాల్ విసురుతోంది. జ‌గ‌న్ మిన‌హా.. సెకండ్ కేడ‌ర్ నాయ‌క‌త్వం లేదు. ఒక‌వేళ‌.. కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన సీనియ‌ర్లు.. ఆ బాధ్య‌త తీసుకున్నా ఏక‌తాటిమీద‌కు తీసుకురావ‌టం పెనుస‌వాల్ అనే చెప్పాలి.

Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*