విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయా….



Want create site? Find Free WordPress Themes and plugins.
బీజేపీని ఓడించేందుకు జాతీయ స్థాయిలో విపక్షాలు ఏకమయ్యే ప్రయత్నాలు ప్రారంభించాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో బీహార్ సి.ఎం నితీష్ కుమార్ భేటీ అయ్యారు. మనమంతా సమైక్యంగా ముందుకెళితే తమ కూటమి విజయం సాధిస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు సోనియా సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచి జోరు మీద ఉంది బీజేపీ కూటమి. యూపీలో బీజేపీ మెజార్టీ సీట్లను గెలుచుకోవడం విపక్షాలను ఆందోళనకు గురి చేస్తోంది. అందుకే మరో కూటమి ఏర్పాటుకు వారు పావులు కదుపుతున్నారు. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీల కూటమి విజయభేరి మోగించిన సంగతి తెలిసిందే. మరోసారి అలా కూటమి ఏర్పాటు చేస్తే గెలుస్తామని ప్రతిపాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇందుకు సోనియా ఒప్పుకోవడంతో మిగతా వారిని కలుపుకునేందుకు పావులు కదుపుతున్నాయి విపక్ష పార్టీలు.  
              కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికే సోనియాగాంధీతో భేటీ అయి తమ మద్దతు తెలిపాయి. మతతత్వ పార్టీగా ముద్ర వేసి.. బీజేపీని అధికారానికి దూరంగా పెట్టేందుకు చిన్న శత్రువుతోనైనా కలిసి పనిచేస్తామని కామ్రేడ్స్ చెబుతున్నారు. ఇందులో భాగంగా సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి లాంటి నేతలు ఇప్పటికే సోనియాగాంధీకి మాట ఇచ్చారంటున్నారు. మరోవైపు బెంగాల్ దీదీ మమతా బెనర్జీ సైతం ఆ కూటమిలో కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారట. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తోను మమతా బెనర్జీ బేటీ అయి భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు. వారి ఆలోచనలను ఆచరణ రూపంలో తెచ్చేందుకు రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడిగా బీజేపీని ఓడించేందుకు మహాకూటమి ఏర్పాటు అయితే.. దాన్ని ధీటుగా ఎదుర్కునేందుకు మరోవైపు కాషాయదళం జాగ్రత్తగా ఎత్తులు వేస్తుంది. ఇది జాతీయ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*