ఖాతాదారులను భయపెడుతున్న ఎస్ బి ఐ



Want create site? Find Free WordPress Themes and plugins.
భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాదారులకు విన్నపం. ఇక మీదట మీరు ఎవరైనా రూ.2000 అంత కంటే తక్కువ గానీ నగదును చెక్కు ద్వారా లావాదేవీలు జరిపితే వంద రూపాయల ఫైన్ చెల్లించాల్సిందే. త్వరలో ఈ నిబంధన అమలులోకి రానుంది. ఈ మేరకు ఎస్ బిఐ ఒక ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే ఐదు బ్యాంకులను తమలో విలీనం చేసుకున్న ఎస్ బిఐ ఈ తాజా నిబంధనతో ఖాతాదారులను ఆందోళనకు గురి చేస్తోంది. మరే బ్యాంకు ఇలాంటి నిబంధనలు విధించలేదని.. ఇలా బ్యాంకు తమను ఇబ్బంది పాలు చేస్తుందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఖాతాదారులు. డిజిటల్ పేమెంట్స్ ను ప్రొత్సహించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఎస్ బిఐ కార్డ్ సిఈవో విజయ్ జసుజా చెప్పారు. విషయం ఏదైనా బ్యాంకు తీసుకున్న నిర్ణయం పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరి బ్యాంకు పునరాలోచన చేస్తుందో లేక కొత్త పద్దతిలోనే వెళుతుందో వేచి చూడాలి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*