చంద్ర‌బాబు మ‌ళ్లీ అదే త‌ప్పు చేస్తారా!Want create site? Find Free WordPress Themes and plugins.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 2004లో వేసిన త‌ప్ప‌ట‌డుగులే ఇప్పుడు వేయ‌బోతున్నారా! గ‌త అనుభ‌వాలు చేదు గుర్తులు మిగిల్చినా  ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై చంద్ర‌బాబు వ్యూహం ఏమిటీ? ఎంతో రాజ‌కీయ అనుభ‌వం.. పాల‌నా స‌మ‌ర్థ‌త గ‌ల నేత‌గా.. చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యం త‌ప్పా! ఒప్పా! అనేదానిపై ఏపీలో చ‌ర్చ మొద‌లైంది. పార్టీ శ్రేణుల్లోనూ బిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 2003 అక్టోబ‌రు 1న తిరుప‌తి అలిపిరి వ‌ద్ద అప్ప‌టి పీపుల్స్‌వార్‌(మావోయిస్టుల) దాడిలో సీఎం హోదాలో వున్న చంద్ర‌బాబు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అప్ప‌టికే హిట్‌లిస్ట్‌లో వున్న ఆయన్ని ల‌క్ష్యంగా గురిపెట్టిన న‌క్స‌లైట్లు, తొలిసారి సీఎం కాన్వాయ్‌పై క్లైమోర్‌మైన్స్‌, ప‌వ‌ర్‌పుల్ బాంబు కారు ఇరువైపుల నుంచి పేల్చారు. బుల్లెట్‌ప్రూప్‌లో ప్ర‌యాణిస్తున్న ఆయ‌న గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ‌టం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌నే చెప్పాలి. అప్ప‌టికే ప‌దేళ్ల టీడీపీ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త తారాస్థాయికి చేరింది. ఇది గ‌మ‌నించిన బాబు చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నాలు చేసినా అప్ప‌టికే ప‌రిస్థితి చేయిదాటింది. అయితే అనుకోని అలిపిరి ఘ‌ట‌న‌తో ప్ర‌జ‌ల్లో సానుభూతి  పెరుగుతుంద‌ని.. గ‌తంలో చేసిన అభివృద్ధికి సానుభూతి తోడైతే.. గెలుపుని తేలిక‌గా భావించిన బాబు ఎనిమిది నెల‌లు ముందుగానే ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. 2014 ఎన్నిక‌ల‌కు సిద్ధం క‌మ్మంటూ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు. అప్ప‌టికే ప్ర‌జావ్య‌తిరేక‌త‌ను అవ‌కాశం చేసుకున్న కాంగ్రెస్ మాస్‌లో ఇమేజ్‌వున్న రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని సీఎం అభ్య‌ర్థిగా  ప్ర‌క‌టించింది. పాతికేళ్లుగా సీఎం పీఠం కోసం ఎదురుచూస్తున్న వైఎస్ పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యాడు. త‌క్కువ వ్య‌వ‌ధిలోనే ఏపీ, తెలంగాణాలను చుట్టోచ్చాడు.  ప్ర‌జ‌లు కూడా వైఎస్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. కాంగ్రెస్ అదిష్ఠానం నుంచి వైఎస్‌కు దీవెనలు… అండ‌దండ‌లు ఉండ‌టంతో పాద‌యాత్ర విజ‌యవంత‌మైంది. 2004 ఎన్నిక‌ల్లో వైఎస్ విజ‌య‌యాత్ర‌కు అడ్డులేకుండా పోయింది. దాని ఫ‌లితం.. ప‌దేళ్ల‌పాటు టీడీపీ ప్ర‌తిప‌క్ష పాత్ర‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. ఆర్ధికంగా.. కేసులు.. ప‌రిటాల ర‌వి వంటి పాపుల‌ర్ నేత హ‌త్య‌కు గురికావ‌టం.. అనంత‌పురం జిల్లాల్లో ఏకంగా 300 మంది కిపైగా టీడీపీ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు మ‌ర‌ణించ‌టం వంటి ఘ‌ట‌న‌లు టీడీపీను కోలుకోలేని దెబ్బ‌తీశాయి. 2014లో గెల‌వ‌క‌పోతే టీడీపీ ప్ర‌తిష్ఠ మ‌స‌క‌బారిన‌ట్లేఅనే భావ‌న‌కు వ‌చ్చారు. దీంతో.. చంద్ర‌బాబు.. గ‌తంలో పొత్తు వ‌ద్ద‌నుకున్న బీజేపీతో జ‌త‌క‌ట్టారు. సామాజిక‌వ‌ర్గాల ఆధారంగా టికెట్స్‌ కేటాయించారు. రైతు రుణ‌మాఫీ, బీజేపీలోని మోదీ ఇమేజ్‌, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌చారం, కాపుల‌ను బీసీల్లో చేర్చ‌టం వంటి హామీలు బాగానే వ‌ర్క‌వుట్ అయ్యాయి. దాని ఫ‌లిత‌మే 175 అసెంబ్లీ సీట్ల‌లో టీడీపీ 102తో అధికారం చేప‌ట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ 67, బీజేపీ 4, ఇండిపెండెంట్స్ 02 సీట్లలో విజ‌యం సాధించారు. టీడీపీకు. వైసీకు మ‌ధ్య కేవ‌లం ఐదు ల‌క్ష‌ల ఓట్లు మాత్ర‌మే తేడా అంటూ వైసీపీ 2019లో మాదే గెలుపంటూ ధీమా వ్య‌క్త‌మ‌చేసింది. మూడేళ్ల పాల‌న‌లో టీడీపీ అమ‌రావ‌తి, పోల‌వ‌రం, న‌దుల అనుసంధానం మీద‌నే దృష్టిసారించింది. రైతురుణ‌మాఫీ ద‌శ‌ల‌వారీగా అంటూ చెప్ప‌టం కొంత విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. కాపుల రిజ‌ర్వేష‌న్ ఇప్ప‌టికీ ఎటూ తేల్చ‌లేదు. కాపు సంక్షేమం కోసం వెయ్యికోట్లు కేటాయించినా.. ఇప్ప‌టికీ అవి క్షేత్ర‌స్థాయిలో చేరిన దాఖ‌లాల్లేవు. వైసీపీ నుంచి వ‌చ్చిన 21 మంది ఎమ్మెల్యేలు ఎంత వ‌ర‌కూ పార్టీకు ఓటుబ్యాంకు తెచ్చిపెడ‌తార‌నేది సందేహమే. మ‌రోవైపు గ‌తంలో ఎన్న‌డూలేనంత‌గా టీడీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. అధినేత‌ను సైతం ఇరుకున పెడుతున్నాయి. ఇటువంటి స‌మ‌యంలోనూ.. రాష్ట్రంలో టీడీపీ 16 శాతం ఓట్ల శాతం పెరిగింద‌ని.. 52 శాతం ఏపీ ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నారంటూ చంద్ర‌బాబు నాయుడు లెక్క‌లు వేస్తున్నారు. స‌ర్వే సంస్థ‌లు.. అధికార పార్టీకు చేర‌వ‌య్యేందుకు ఇటువంటి స‌ర్వేలు చేస్తూ.. గాల్లో మేడ‌లు క‌డ‌తాయ‌నే విమ‌ర్శ‌లున్నాయి. భిన్న వాతావ‌ర‌ణం.. విభిన్న ప‌రిస్థితులు.. ప‌లు ర‌కాల స‌మ‌స్య‌లు చుట్టుముట్టిన స‌మ‌యంలో చంద్ర‌బాబు ముంద‌స్తు వ్యూహం ఎవ‌రి అంచ‌నాకు అంతుబ‌ట్ట‌కుండా ఉందంటూ తెలుగు త‌మ్ముళ్లు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*