వైజాగ్ పై  విజ‌య‌సాయిరెడ్డి క‌న్ను ప‌డిందా…



Want create site? Find Free WordPress Themes and plugins.
పోయిన చొటే వెతుక్కోవాలనే సిద్దాంతాన్ని వైసీపి పాటిస్తున్న‌ట్టుంది.  పార్టీ గౌరవ అధ్యక్షురాలు, వైఎస్ఆర్ భార్య అయిన విజయలక్ష్మి 2014 ఎన్నికల్లో వైజాగ్ నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే.. ఓటమికి కారణాలను అన్వేషించి వాటిని అధిగమించేందుకు విజయసాయి రెడ్డి వైజగ్ పై దృస్టి పెట్టారు.. అందులో భాంగానే తరచూ వైజగ్ లో నెలలో సుమారు మూడునాలుగు రోజులు ఉంటూ పార్టీ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. దీంతో పాటు వీలు చిక్కినప్పుడుల్లా పార్లమెంట్ లో కూడా రైల్వేజోన్ తోపాటు విశాఖ సమస్యలను ప్రస్థావిస్తూ విశాఖవాసుల మనసు దోచుకునేందుకు సాయిరెడ్డి ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు.. జనవరి నెలలోనే 9,10,11,20,21,26 తేదీలలో ఆయన వైజాగ్ లో ఉండి పార్టీలోకి వచ్చే వారి కోసం అన్వేషణ చేసినట్లు పార్టీ నేతలు చెబతున్నారు.. ఇప్పటికే కొంత మంది మాజీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగి కనుమరుగైన వారిని వెతికే పనిలో సాయిరెడ్డి నిమగ్నమైనట్లు సమాచారం..మార్చి నెలలో కూడా మూడు రోజుల పాటు వైజాగ్ లోనే ఉండి పార్టీలో్కి తీసుకునే లీడర్ల లిస్టు తయారు చేసి ఒక్కొక్కరుగా పార్టీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో బాగంగా యలమంచిలి నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే కన్నబాబు ను చర్చలు జరిపి  పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.. రెండు రోజుల క్రితం ఆయన్ను రహస్యంగా లోటస్ పాంట్ లో జగన్  ని కలిసేలా చేసారు.  అన్ని అనుకున్నట్లు జరిగితే కన్నబాబు త్వరలో పార్టీలో జేరే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబతున్నాయి..విజయలక్ష్మి ఓటమితో కుదేలైన పార్టీ గాడిలో పెట్టేందుకు సాయిరెడ్డి పావులు కదుపుతూనే,  వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచే ఎంపిగా తాను పోటీ చేస్తున్నట్లు సంకేతాలు పార్టీ కేడర్లో కల్పిస్తున్నట్లు సమాచారం.. ఉత్తరాంధ్రలో వైఎస్ కుటుంబసభ్యలు పోటీలో ఉంటే ఇక్కడ పార్టీ కేడర్ కు కూడా నైతిక భలం ఉంటుందని పార్టీ అంచనా వేస్తున్నట్లు నేతలు చెబుతున్నారు.. అందుకే నెలలో కనీసం మూడు రోజులైనా వైజగ్ లో ఉండేలా సాయిరెడ్డి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది..మొత్తానికి విజయసాయిరెడ్డి వైజాగ్ పై దృస్టి పెట్టగా దాడి వీరభద్రరావు, కొనతాల రామకృష్ణ లాంటి సీనియర్ నేతలు ఉన్నప్పుడే వైఎస్ విజయలక్ష్మి ఎంపిగా పోటీ చేసి ఓడిపోగా ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసే ప్రయత్నాలు ఎంత వరకు పలిస్తాయో వేచి చూడాలి….
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*