మే 2న ‘సరసుడు’ ఆడియో ఆవిష్కరణ….Want create site? Find Free WordPress Themes and plugins.
మొన్న.. ‘మన్మథ’, నిన్న.. ‘వల్లభ’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసిన హీరో శింబు ఇప్పుడు ‘సరసుడు’గా వస్తున్నాడు. నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాకి పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత టి.రాజేందర్‌ నిర్మించిన ఈ చిత్రానికి శింబు సోదరుడు టి.ఆర్‌. కురళ అరసన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీలో ఉన్న 5 పాటల్ని కెనడాలో కంపోజ్‌ చేశారట. చాలా గ్యాప్‌ తర్వాత తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన నిర్మాత దీనికి మాటలు, పాటలు రాస్తున్నారని తెలుస్తోంది. సింగర్‌గా, నటుడుగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్‌ఫుల్‌గా తన కెరీర్‌ని కొనసాగిస్తున్న రాజేందర్‌ ఈ చిత్రంతో మరోసారి హైలైట్‌ అవ్వబోతున్నారట. మే 2న ఈ చిత్రం ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్‌ చేసి అదేనెలలో సినిమాని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సత్యం రాజేష్‌, సూరి, సంతానం, జయప్రకాష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా బాలసుబ్రమణ్యం, ఎడిటింగ్‌ ప్రవీణ్‌-ప్రదీప్‌, ఆర్ట్‌ ప్రేమ్‌ నవాజ్‌, కొరియోగ్రఫీ సతీష్‌, రచనా-సహకారం బోస్‌ గోగినేని, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ వెంకట్‌ కొమ్మినేని, కో-ప్రొడ్యూసర్‌ శ్రీమతి ఉషా రాజేందర్‌లు అందించారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*